ముఖ్యమంత్రి పదవికి రాజీనామా


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయనున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలను చూసి షాక్ తిన్న చంద్రబాబు రాజీనామా చేయడానికి సిద్ధమయ్యాడు. ఈరోజు సాయంత్రం తన రాజీనామా లేఖను గవర్నర్ నరసింహన్ కు అందజేయనున్నాడు.

చంద్రబాబు కు ఘోరమైన ఓటమి లభించింది ఈ ఎన్నికల్లో. కనీసం ప్రతిపక్ష హోదా కూడా లభించేలా కనిపించడం లేదు తెలుగుదేశం పార్టీకి . 175 అసెంబ్లీ స్థానాల్లో 152 స్థానాల్లో జగన్ పారీ దూసుకుపోతుండగా తెలుగుదేశం పార్టీకి కేవలం 23 స్థానాల్లో మాత్రమే ఆధిక్యత లభిస్తోంది.