రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయంRevanth Reddy
Revanth Reddy

పాదయాత్ర చేసిన వాళ్ళు ముఖ్యమంత్రులుగా వెలుగొందుతుండటంతో తెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి పాదయాత్ర చేయాలనే సంచలన నిర్ణయానికి వచ్చాడట ! మల్కాజ్ గిరి పార్లమెంట్ స్థానం నుండి పోటీ చేసి సంచలన విజయం సాధించడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో అలాగే రేవంత్ రెడ్డి లో సరికొత్త జోష్ వచ్చింది . కొడంగల్ లో ప్రజలు ఓడించినప్పుడు తీవ్ర షాక్ కి గురైన రేవంత్ రెడ్డి ఆర్నెల్ల కాలంలోనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సత్తా చాటాడు .

దాంతో తెలంగాణలో పాదయాత్ర చేస్తూ కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి , అక్రమాలను ఎండగట్టాలని ప్లాన్ చేస్తున్నాడట . అసలు గతంలో తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడే పాదయాత్ర చేయాలనీ అనుకున్నాడు కానీ అప్పట్లో చంద్రబాబు అనుమతి ఇవ్వలేదు దాంతో కాంగ్రెస్ పార్టీలో చేరాడు రేవంత్ . ఇక కాంగ్రెస్ పార్టీని మరింతగా బలోపేతం చేయాలంటే , కేసీఆర్ ని ఎదుర్కోవాలంటే పాదయాత్ర తప్పనిసరి అని భావిస్తున్నాడట , అంతేకాదు పాదయాత్ర ద్వారా అధికార పీఠం ఎక్కొచ్చు అన్నది కూడా ఓ ఆలోచన అట ! అయితే ఈ పాదయాత్ర ఎప్పుడు అనేది త్వరలోనే తేలనుందట .