ముఖ్యమంత్రి రేసులో రేవంత్ రెడ్డి


Revanth reddy become CM candidate from prajakutami

కాంగ్రెస్తెలుగుదేశం , టి జె ఎస్ , సి పి ఐ భాగస్వామ్య పక్షాలతో ఏర్పడిన ప్రజా కూటమి తెలంగాణ ఎన్నికల బరిలో దూసుకుపోతున్న విషయం తెలిసిందే . అయితే ఈ కూటమి అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రి ఎవరు ? అంటే పదిమంది పైనే అభ్యర్థులు కనబడుతున్నారు కానీ అందరికంటే మొగ్గు రేవంత్ రెడ్డి వైపే అని తెలుస్తోంది ఎందుకంటే రాహుల్ గాంధీ ఏకంగా రేవంత్ రెడ్డి కి ఎన్నికల ప్రచారం కోసం హెలికాఫ్టర్ ఇచ్చాడు . రేవంత్ రెడ్డి ప్రచారానికి ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన వస్తుండటంతో అది స్వయంగా రాహుల్ గాంధీ చూడటంతో రేవంత్ లాంటి వాడు కొన్ని నియోజక వర్గాలకు పరిమితం కాకూడదని తెలంగాణ అంతటా పర్యటించేలా చూడాలని హెలికాఫ్టర్ కేటాయించారట .

ఇంకేముంది రేవంత్ రెడ్డి హెలికాఫ్టర్ లో తెలంగాణ ని చుట్టేస్తున్నాడు . రేపు ప్రజా కూటమి అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని అప్పుడే గుసగుసలు మొదలయ్యాయి . కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి కి రోజు రోజుకి ప్రాధాన్యత పెరిగిపోతోంది . సీనియర్ నాయకులు సైతం నా నియోజకవర్గం లో తిరుగు ప్రచారం చెయ్ అని రేవంత్ ని అడుగుతున్నారంటే రేవంత్ ప్రాముఖ్యత ఏంటో యిట్టె అర్ధం చేసుకోవచ్చు .

English Title: Revanth reddy become CM candidate from prajakutami