సిరిసిల్ల ని దత్తత తీసుకున్న రేవంత్ రెడ్డి


Revanth reddy campaign in sircilla

సిరిసిల్ల నియోజకవర్గం అంటే కేటీఆర్ అడ్డా అన్న విషయం తెలిసిందే . 2009 లో సిరిసిల్లా లో గెలిచినప్పటి నుండి అక్కడి నుండే పోటీచేస్తున్నాడు కేటీఆర్ . అయితే తాజాగా నిన్న సిరిసిల్ల లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి తరుపున ప్రచారానికి వెళ్లిన ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి సిరిసిల్ల నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నట్లుగా ప్రకటించాడు . సిరిసిల్ల ని నేను దత్తత తీసుకుంటున్నా అంటూ వేలాది మంది ప్రజల సమక్షంలో కేటీఆర్ పై కేసీఆర్ పై నిప్పుల వర్షం కురిపించాడు . ఉద్యమ సమయంలో సిరిసిల్ల నియోజకవర్గం లో టీఆర్ఎస్ తరుపున పోరాటం చేసింది కేకే మహేందర్ రెడ్డి , అయితే విదేశాల నుండి కేటీఆర్ ని రప్పించిన కేసీఆర్ 2009 లో కేకే మహేందర్ రెడ్డి కి కాకుండా కేటీఆర్ కు టికెట్ ఇచ్చాడు దాంతో కేకే మహేందర్ రెడ్డి అపుడు ఇండిపెండెంట్ గా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓడిపోయాడు దాంతో కేకే పట్ల సిరిసిల్ల లో సానుభూతి ఉంది .

దానికి తోడు సిరిసిల్ల నియోజకవర్గంలో ఇసుక మాఫియా దారులు దళితులపై చేసిన దాడులతో కేటీఆర్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఉంది దాన్ని క్యాష్ చేసుకోవడానికి పలుమార్లు సిరిసిల్ల కు వెళ్ళాడు రేవంత్ రెడ్డి . ఇక ఇప్పుడేమో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కూడా కావడంతో కేసీఆర్ , కేటీఆర్ , కవితల పట్ల తీవ్ర విమర్శలు చేస్తూ ప్రజల ఆదరణ పొందుతున్నాడు . సిరిసిల్ల లో కేకే మహేందర్ రెడ్డి ని గెలిపిస్తే అభివృద్ధి బాధ్యత నేను తీసుకుంటానని హామీ ఇచ్చాడు రేవంత్ . కేటీఆర్ అమెరికాలో బాత్ రూంలు కడిగే పని చేసాడని , రేపు ఓడిపోతే మళ్ళా అమెరికా వెళ్తాడు కానీ మహేందర్ రెడ్డి ఇక్కడే పుట్టిండు , ఇక్కడే చస్తాడు కాబట్టి మహేందర్ రెడ్డి ని గెలిపించండి అంటూ కోరాడు రేవంత్ రెడ్డి .

English Title: Revanth reddy campaign in sircilla