పార్లమెంట్ కు పోటీ చేస్తానంటున్న రేవంత్ రెడ్డి


Revanth reddy ready to fight in lok sabha elections

పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ కు పోటీ చేయడానికి నేను సిద్ధమని ప్రకటించాడు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి . 2018 డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో కొడంగల్ నుండి అసెంబ్లీ కి పోటీచేసిన రేవంత్ రెడ్డి ఓడిపోయిన విషయం తెలిసిందే . అయితే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన మూడు నెలలకే మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి తెలంగాణలో దాంతో పలువురు సీనియర్ లు పోటీ చేయడానికి భయపడుతున్నారు .

 

దాంతో పార్టీ ఆదేశిస్తే తెలంగాణ లో ఎక్కడి నుండైనా పోటీ చేయడానికి నేను సిద్ధం అంటూ ప్రకటించాడు రేవంత్ రెడ్డి . ఇక కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ లాంటోడని , కాంగ్రెస్ పార్టీ సచిన్ టెండూల్కర్ లాంటి దిగ్గజ పార్టీ అని పార్లమెంట్ ఎన్నికల్లో తగిన శాస్తి చేస్తారని అంటున్నాడు రేవంత్ రెడ్డి . తెలంగాణలో ఏప్రిల్ 11న పోలింగ్ జరుగనుంది .

English Title : Revanth reddy ready to fight in lok sabha elections