రేవంత్ రెడ్డి సంచలన విజయంతెలంగాణ ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడిగా సంచలన విజయం సాధించాడు. ప్రత్యర్థి టీఆర్ఎస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి పై 6 వేల ఓట్లతో గెలుపొంది ప్రభంజనం సృష్టించాడు. రేవంత్ రెడ్డి గెలవడం కష్టమే అనుకుంటే అనూహ్యంగా అధికార పార్టీ అభ్యర్థి ని అందునా కేసీఆర్ , కేటీఆర్ లను ఎదుర్కొని పోరాడి మరీ సంచలన విజయం సాధించడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ఆరు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో కొడంగల్ అసెంబ్లీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయాడు. రేవంత్ రెడ్డి ఓడిపోవడం రాజకీయ వర్గాల్లో అప్పట్లో సంచలనం సృష్టించింది. అయితే ఆరు నెలల తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజిగిరి నుండి పోటీ చేసి విజయం సాధించడంతో రేవంత్ తో పాటుగా కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం ఉరకలు వేస్తోంది.