క్రిష్ మహేష్ ల సినిమా ఆగిపోవడానికి కారణం తెలుసా


revealed the secret behind mahesh and krish film

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకులు క్రిష్ కాంబినేషన్లో ఎపుడో సినిమా రావాల్సి ఉండే ….. సంవత్సరాలు గడుస్తున్నాయి కానీ సినిమా మాత్రం పట్టాలెక్కడం లేదు. ఇక ఈ కాంబినేషన్ లో సినిమా డౌటే అని అనుకుంటున్న సమయంలో ప్రముఖ రచయిత సాయి మాధవ్ బుర్రా అసలు విషయాన్ని బట్టబయలు చేసాడు. అసలు ఈ ఇద్దరి కాంబినేషన్ లో ఇప్పటివరకు సినిమా రాకపోవడానికి కారణం ఏంటో తెలుసా…….. మహేష్ ఖాళీగా ఉన్న సమయంలో క్రిష్ బిజీ గా ఉండటం , మహేష్ బిజీ గాఉన్న సమయంలో క్రిష్ ఖాళీగా ఉండటంతో ఇప్పటివరకు సినిమా చేయలేక పోయారని అయితే త్వరలోనే తప్పకుండా మహేష్ – క్రిష్ లు సినిమా చేయడం ఖాయమని దానికి రచన చేసేది నేనే అని అంటున్నాడు సాయి మాధవ్ బుర్రా.

ప్రస్తుతం మహేష్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తన 25వ సినిమా చేస్తుండగా క్రిష్ ప్రతిష్టాత్మకమైన ఎన్టీఆర్ బయోపిక్ చేస్తున్నాడు. ఇంతకుముందు బాలకృష్ణ – క్రిష్ కాంబినేషన్లో వచ్చిన గౌతమిపుత్ర శాతకర్ణి సంచలన విజయం సాధించడంతో ఎన్టీఆర్ బయోపిక్ పై భారీ అంచనాలు పెరిగాయి. తక్కువ సమయంలో బ్రహ్మాండమైన ఔట్ పుట్ ఇవ్వడం క్రిష్ కే చెల్లింది. మహేష్ బాబు – క్రిష్ ల కాంబినేషన్లో కనుక సినిమా వస్తే భారీ అంచనాలు నెలకొనడం ఖాయం . క్రిష్ మాస్ దర్శకులు కాదు కాని మహేష్ కు అన్ని వర్గాల్లో ఆదరణ ఉంది కాబట్టి ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చే సినిమా రికార్డ్ సృష్టించడం ఖాయమని ఆశిస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

English Title: revealed the secret behind mahesh and krish film