వోడ్కా మత్తులో మరో సినిమాను ప్రకటించిన వర్మ

RGV announces another film dadas of Hyderabad
RGV announces another film dadas of Hyderabad

రామ్ గోపాల్ వర్మ.. ఇదివరకు ఎంత గొప్ప దర్శకుడైనా అవ్వొచ్చు. ఇదివరకు టెక్నీకల్ ఎన్ని ఉత్తమమైన చిత్రాలనైనా అందించి ఉండవచ్చు, ఎంతోమంది నేటి టాప్ దర్శకులకు ఇండస్ట్రీకి రావడానికి ఇన్స్పిరేషన్ అయ్యి ఉండవచ్చు కానీ ప్రస్తుతం వర్మ సినిమాలను ఎవరూ కేర్ కూడా చెయ్యట్లేదనేది వాస్తవం. ఇది వరకు స్టార్ హీరోలు సైతం వర్మ దర్శకత్వంలో పనిచేయాలని ఆశపడేవారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన హీరో అయినా సరే వర్మ సినిమా అంటే భయపడుతున్నారు. ఇదివరకు వర్మ సినిమా తీస్తే సంచలనమయ్యేది కానీ ఇప్పుడు సంచలనాల కోసం సినిమాలు తీయాల్సిన పరిస్థితి. దర్శకుడిగా బయోపిక్ లు కాకుండా వర్మ నుండి వచ్చిన బెస్ట్ అవుట్ ఫుట్ వచ్చి దశాబ్దకాలానికి పైగా దాటిపోయింది. అయినా ఇండస్ట్రీలో ఇప్పటికీ వర్మ మనగలుగుతున్నాడంటే అది రోజూ ఏదొక కాంట్రవర్సి లో నిలుస్తూ నిత్యం వార్తల్లో ఉంటాలన్న తన తపనే.

రామ్ గోపాల్ వర్మకు రాత్రి వోడ్కా మత్తులో సినిమాలు అనౌన్స్ చేయడం, పొద్దున్న కాఫీ పడగానే క్యాన్సిల్ చేయడం సర్వసాధారణమైపోయింది. ఆ మధ్య అలాగే రాత్రి వోడ్కా మత్తులో మెగా ఫామిలీ అనే సినిమాను అనౌన్స్ చేసాడు. అయితే పొద్దున్నే ఆ సినిమా క్యాన్సిల్ అని ప్రకటించేశాడు. ఎందుకిలా అని అడిగితే రాత్రి వోడ్కా తాగినప్పుడు అనౌన్స్ చేశా, పొద్దున్నే కాఫీ పడగానే దిగిపోయింది, క్యాన్సిల్ చేసేసా అని చెప్పేసాడు. ఇప్పుడు కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్న ర గోపాల్ వర్మ, మొన్న రాజకీయనాయకుడు వల్లభనేని వంశీ కాంట్రవర్సీ జరిగినప్పుడు రెడ్డి రాజ్యంలో కమ్మ ఫ్యాన్స్ అని మరో సినిమాను అనౌన్స్ చేసాడు. ఇందులో ఏం తీస్తాడా అని ఆలోచించే లోపలే, ఇప్పుడు మరో సినిమాను అనౌన్స్ చేసేసాడు. జార్జి రెడ్డి సినిమాలో హీరోగా చేసిన శాండీని హీరోగా పెట్టి దాదాస్ ఆఫ్ హైదరాబాద్ అనే సినిమా తీస్తాడట. 80వ దశకంలో హైదరాబాద్ లో ఆధిపత్యం చెలాయించిన రౌడీలా నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, దీనికి తాను తీసిన శివ సినిమా ఇన్స్పిరేషన్ అని ప్రకటించాడు. ఇప్పుడు సినిమా అనౌన్స్ చేసాడు సరే, పొద్దున్నే మళ్ళీ క్యాన్సిల్ అనడుగా.