ఆర్జీవి డ్యాన్స్ అరాచ‌కం అంతే!


ఆర్జీవి డ్యాన్స్ అరాచ‌కం అంతే!
ఆర్జీవి డ్యాన్స్ అరాచ‌కం అంతే!

వివాదాస్ప‌ద చిత్రాల ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్‌వ‌ర్మ ఏది చేసినా అరాచ‌క‌మే. వ‌రుస సినిమాల‌తో పిచ్చెక్కిస్తున్న ఆయ‌న `అమ్మ రాజ్యంలో క‌డ‌ప బిడ్డ‌లు` సినిమాతో సంచ‌ల‌నం సృష్టించారు. తాజాగా ఆయ‌న టీమ్ నుంచి వ‌స్తున్న చిత్రం `బ్యూటిఫుల్‌`. నైనా గంగూలీ, పార్ధ్ సూరి జంట‌గా న‌టించిన ఈ చిత్రానికి అగ‌స్త్య మంజు ద‌ర్శ‌కుడు. ఏ ట్రి బ్యూట్ టు `రంగీలా` అనే క్యాప్ష‌న్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు.

జ‌న‌వ‌రి 1న నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌ల‌తో ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ప్రీ రిలీజ్ కార్య‌క్ర‌మం సోమ‌వారం రాత్రి జ‌రిగింది. ఈ ఈ వెంట్‌కు ఆర్జీవీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. హీరోయిన్ నైనా గంగూలి, హీరో పార్ధ్ సూరి స్టేజ్ పైకి వ‌చ్చి డ్యాన్స్ అందుకోగానే రామ్‌గోవాల్ వ‌ర్మ‌కు కూడా పూన‌కం వ‌చ్చేసింది. హింటిస్తే రెచ్చిపోయే వ‌ర్మ‌కు మూడొస్తే ఇంకేమైనా వుందా ర‌చ్చ ర‌చ్చే అయిపోదూ. అచ్చు అదేజ‌రిగింది.

హీరోయిన్ నైనా గంగూలి, హీరో క‌లిసి డ్యాన్స్ చేస్తూ మ‌ధ్య‌లో దూరి విచిత్ర‌మైన భంగిమ‌ల‌తో ఆర్జీవి డ్యాన్స్ కంపోజ్ చేసిన తీరు అరాచ‌కం అంతే. చిత్ర విచిత్ర‌మైన స్టెప్పుల‌తో డ్యాన్స్ మాస్ట‌ర్స్‌కే అంద‌ని కిరాక్ స్టెప్పుల‌తో ఆర్జీవి చేసిన హంగామా సోస‌ల్‌మీడియాలో వైర‌ల్‌గా మారింది. వ‌ర్మ స్టెప్పుల్ని భ‌రించ‌లేక హీరోయిన్ ఘొల్లున న‌వ్వ‌డం ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. కొంత మంది మాత్రం ఆర్జీవి డ్యాన్స్‌ని త‌ట్టుకోలేక ఇదేం కిరాక్ డ్యాన్స్ బాబోయ్ అంటూ కాళ్ల‌కి ప‌నిచెప్పారు.