మరో వివాదంలో వర్మ


మరో వివాదంలో వర్మ
మరో వివాదంలో వర్మ

భారతదేశం గర్వించదగ్గ దర్శకుల్లో ఒకరు అనే టైటిల్ నుండి, కేవలం సంచలనాలను వాడుకొని సినిమాలు తీసి బాగుపడతాడు.! అనే టైటిల్ కి తగ్గిపోయిన రామ్ గోపాల్ వర్మ తాజాగా మరో సంచలనాత్మకమైన ట్వీట్ తో వార్తల్లో నిలిచాడు. ఇప్పటికే ఈ ఏడాది బ్యూటిఫుల్ అనే పేరుతో తన శిష్యుడైన అగస్త్య మంజు మరొకసారి దర్శకునిగా పరిచయం చేసిన రామ్ గోపాల్ వర్మ, ప్రస్తుతం బ్రూస్ లీ సినిమా “ఎంటర్ ది డ్రాగన్” స్ఫూర్తితో ఒక లేడీ ఓరియంటెడ్ మార్షల్ ఆర్ట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. గతంలో వివాదాస్పదమైన ట్వీట్లు చేసి వార్తల్లో నిలిచి వాటిలో అతి ముఖ్యమైన వివాదాలకు మాత్రం, సారీ చెప్పి ఫుల్ స్టాప్ పెట్టే వర్మ గారు ఇప్పుడు కూడా అలాంటి వివాదాస్పదమైన ట్వీట్ ఒకటి చేశారు.

ఒక వీడియోలో వ్యక్తి జింకను తుపాకీతో గాలిస్తున్నట్లు ఉన్న ఒక వీడియో ని తన ట్విట్టర్ అకౌంట్ లో షేర్ చేసి సల్మాన్ ఖాన్ ని ఉద్దేశిస్తూ రాంగోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. “ఇదిగో… ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్న వ్యక్తి మామూలు వ్యక్తి కాబట్టి ఎవరు ఇతని పట్టించుకోవడం లేదు. అదే అతను నిజంగా సూపర్ స్టార్ అయి ఉంటే, అతను చేస్తున్నది నేరంగా పరిగణించి చట్టప్రకారం చర్యలు తీసుకునే వాళ్ళు. భారతదేశంలో మామూలు వ్యక్తికి లేని తప్పు సూపర్ స్టార్ చేస్తేనే వస్తుంది.” అని గతంలో సల్మాన్ ఖాన్ కృష్ణజింకల వేట కేసు ఉదంతం గురించి రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు ట్వీట్ చేశాడు. ప్రస్తుతం బాలీవుడ్ వర్గాల్లో మాత్రమే కాకుండా సామాజిక మాధ్యమాలలో ఈ వ్యాఖ్యలు దుమారం రేపటితో రాంగోపాల్ వర్మ పై చట్ట ప్రకారం కేసు నమోదు చేసే అవకాశాలున్నాయి.

Credit: Twitter