కమ్మ రాజ్యానికి రెడ్లే కారణం అంటున్న ఆర్.జీ.వి

Kamma Rajyam Lo Kadapa Redlu
Kamma Rajyam Lo Kadapa Redlu

ఆర్.జి.వి ఇది పేరు కాదు ప్రభంజనం. “శివ” తో సైకిల్ చైన్ తెంపించాడు, రక్తాన్ని అడ్డం పెట్టుకుని దానికి చరిత్ర ఉందని తీసాడు. ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో పెద్ద పుస్తకం ఉంది. జనరల్ గా ఒక డైరెక్టర్ గురించి మాట్లాడాలి అంటే అతని హిట్లు, ఫట్లు చెప్తారు కానీ ఆర్.జి.వి విషయంలో అలా ఉండదు.

రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసిన దాని నుండి ఇన్స్పిరేషన్ అయిన వాళ్ళు ఉన్నారు. మొన్ననే “లక్ష్మీ’స్ ఎన్.టి.ఆర్” తీసి ఒక షాక్ ఇచ్చాడు, నిజానికి ఆ సినిమా కూడా ఫలితం రాలేదు కానీ, ఒకే పర్వాలేదు అనిపించింది.

ఇక వెంటనే “కమ్మ రాజ్యం లో కడప రెడ్లు” సినిమా చేస్తున్నా అని పోస్టర్, పాటలు, ఇలా ఒక్కొక్కటి అప్డేట్ ఇస్తూ ఉన్నాడు. అసలు ఆ సినిమా తీయడానికి కారణం ఏంటని అడిగితే, మొన్న ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల విషయం లో “జగన్ మోహన్ రెడ్డి” గారు గెలవడం, ఒక్కసారిగా కడప రెడ్లు రెచ్చిపోవడం, హోటల్ మరియు ఇతర ప్రాంగణాలు అన్ని ఒక్కసారిగా రెడ్లు అని మాట మార్మోగిపోవడం, కమ్మ వాళ్ల్లు సైలెంట్ గా కనిపించకుండా పోవడం లాంటివి సినిమాకి కారణం అని పలికారు.

మరి వాళ్ళు రెడ్లు అని ఎలా తెలిసింది అంటే బహుశా వాళ్ళ వేషధారణ, మాట, హడావిడి చూసి ఉండొచ్చు అని అందరి అభిప్రాయం.