ప్ర‌శాంత్ నీల్ `కేజీయఫ్‌2`తో బిగ్ పంచ్ ఇచ్చాడ‌ట‌!


ప్ర‌శాంత్ నీల్ `కేజీయఫ్‌2`తో బిగ్ పంచ్ ఇచ్చాడ‌ట‌!
ప్ర‌శాంత్ నీల్ `కేజీయఫ్‌2`తో బిగ్ పంచ్ ఇచ్చాడ‌ట‌!

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టిస్తున్న టీజ‌ర్ `కేజీఎప్‌2`. రాక్‌స్టార్ య‌ష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ టీజ‌ర్ ఇటీవ‌లే విడుద‌లై విష‌యం తెలిసిందే. హీరో య‌ష్ పుట్టిన రోజుకి ఒక్క రోజు ముందుగానే విడుద‌లై ఈ టీజ‌ర్ యూట్యూబ్ లో సంచ‌ల‌నాలు సృష్టిస్తోంది. రికార్డు స్థాయి వ్యూస్‌తో అన్ని రికార్డుల్ని తిర‌గరాస్తోంది. ఇప్ప‌టికే ఈ మూవీ టీజ‌ర్ యూట్యూబ్‌లో 150 మిలియ‌న్ వ్యూస్‌ని క్రాస్ చేసి చ‌రిత్ర సృష్టించ‌డం సంల‌చ‌నంగా మారింది.

ఈ మూవీ టీజ‌ర్ సాధిస్తున్న సంచ‌ల‌నాల‌పై వివాదాస్ప‌ద డైరెక్ట‌ర్ రామ్ గోపాల్‌వ‌ర్మ తాజాగా స్పందించారు. ఓ ప‌ట్టాన ఎవ‌రినీ ప్ర‌శంసించ‌ని వ‌ర్మ కేజీఎఫ్ టీజ‌ర్‌పై, ద‌రర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్‌పై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపించారు. టీజ‌ర్‌కు వ‌ర్మ ఫిదా అయిపోయారు. ఈ మూవీతో క‌న్న‌ర‌డ చిత్ర ప‌రిశ్ర‌మ ప్రొటెన్షియాలిటీని ప్ర‌పంచానికి చాటి చెప్పాల‌ని అభినందించారు.

`బాహుబ‌లి 2` ట్రైల‌ర్ 3 సంవ‌త్స‌రాల్లో 11 కోట్ల వ్యూస్‌ని సాధించింది. 3 నెల‌ల్లో `ఆర్ ఆర్ ఆర్‌` 3.8 కోట్ల వ్యూస్‌ని రాబ‌ట్టింది. ఇక 3 రోజుల‌లో `కేజీఎఫ్ 2`టీజ‌ర్ 14 కోట్ల వ్యూస్‌ని అధిగ‌మించింది.. వాహ్‌! ఇది క‌న్న‌డీగుల త‌రుపున ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్ ఇచ్చిన బిగ్ పంచ్‌. ఇది అన్ని చిత్ర ప‌రిశ్ర‌మ‌ల‌కు వ‌ర్తిస్తుంద‌న్న‌ట్టుగా ట్వీట్ చేసి షాకిచ్చారు.