`వాళ్లిద్ద‌రి మ‌ధ్య` లిరిక‌ల్ వీడియో ఔట్‌!


`వాళ్లిద్ద‌రి మ‌ధ్య` లిరిక‌ల్ వీడియో ఔట్‌!
`వాళ్లిద్ద‌రి మ‌ధ్య` లిరిక‌ల్ వీడియో ఔట్‌!

విరాజ్ అశ్విన్‌, నేహాకృష్ణ జంట‌గా న‌టిస్తున్న చిత్రం `వాళ్లిద్ద‌రి మ‌ధ్య‌`. వి.ఎన్‌. ఆదిత్య ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. .వేదాన్ష్ క్రియేటీవ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్‌పై అర్జున్ దాస్య‌న్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని `ల‌త్కోర్ ల‌వ్వంతే..` అంటూ సాగే లిరిక‌ల్ వీడియోని శ‌నివారం ద‌ర్శ‌ఖుడు రామ్‌గోపాల్ వ‌ర్మ రిలీజ్ చేశారు.ఈ సంద‌ర్భంగా టీమ్‌ని అభినందించారు.

ద‌ర్శ‌కుడు వి.ఎన్‌. ఆదిత్య మాట్లాడుతూ ` చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ కూడా పూర్త‌యింది ఫ‌స్ట్ కాపీ సిద్ధ‌మైంది. మంచి క‌థ‌కు, మంచి ఆర్టిస్ట్‌లు, టెక్నీషియ‌న్లు దొరక‌డం ఎంత ముఖ్య‌మో, పూర్తి స్థాయి స్వేచ్ఛ‌నిచ్చే నిర్మాత దొర‌క‌డం అంత‌క‌న్నా ముఖ్యం. అర్జున్ దాస్య‌న్ అభిరుచిగ‌త నిర్మాత‌. వ్యాపార రంగంలో విజ‌యం సాధించిన‌ట్టుగానే సినిమా రంగంలో కూడా ఆయ‌న స‌క్సెస్ సాధిస్తారు. 5 కోట్ల వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. మార్తాండ్ కె. వెంక‌టేష్ మేన‌ల్లుడు విరాజ్ హీరోగా, అమెరికాలో స్థిర‌ప‌డిన తెలుగ‌మ్మాయి నేహాకృష్ణ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతున్నారు. ఉత్తేజ్‌కి చెందిన మ‌యూఖ్ స్కూల్, అభిన‌య స్కూల్ ఆఫ్ యాక్టింగ్‌లో శిక్ష‌ణ తీసుకున్న వారిని, కిర్రాక్ సీత‌ని ఈ సినిమా ద్వారా ప‌రిచ‌యం చేస్తున్నాం`అన్నారు.

నిర్మాత‌గా నాకిదే తొలి సినిమా. ద‌ర్శ‌కుడు వి.ఎన్‌. ఆదిత్య అనుభ‌వం వ‌ల్ల ఏ విష‌యంలోనూ రాజీప‌డ‌కుండా నిర్మించాం. అంద‌మైన లొకేష‌న్‌ల‌లో షూటింగ్ చేశాం. మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మ‌ధు స్ర‌వంతిని, కెమెరామెన్‌గా పీజీ విందా వ‌ద్ద వ‌ర్క్ చేసిన ఆర్ ఆర్‌ని సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌రిచ‌యం చేస్తున్నాం.  `ఇస్మార్ట్ శంక‌ర్‌` చిత్రానికి ఫైట్స్ అందించిన రియ‌ల్ స‌తీష్ ఫైట్స్ మా చిత్రానికి అద‌న‌పు ఆకర్ష‌ణ‌గా నిలుస్తాయి‌` అన్నారు నిర్మాత అర్జున్ దాస్య‌న్‌.