మాస్ రాజా కోసం ఆర్జీవీ బాంబ్ షెల్‌!


మాస్ రాజా కోసం ఆర్జీవీ బాంబ్ షెల్‌!
మాస్ రాజా కోసం ఆర్జీవీ బాంబ్ షెల్‌!

మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా న‌టిస్తున్న చిత్రం `క్రాక్‌`. గోపీచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఠాగూర్ మ‌ధు నిర్మిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇటీవ‌లే మ‌ళ్లీ మొద‌లైంది. దాదాపు ఏడు నెల‌ల విరామం త‌రువాత ఈ మూవీ షూటింగ్‌ని మొద‌లుపెట్టారు. చివ‌రి షెడ్యూల్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది.

ఈ మూవీకి సంబంధించి ఓ స‌ర్‌ప్రైజింగ్ ఐట‌మ్ సాంగ్‌ని షూట్ చేస్తున్నారు. మాస్ రాజా ర‌వితేజ‌తో పాటు  ఈ పాట‌లో అప్స‌రారాణి న‌టిస్తోంది. ఆర్జీవీ రూపొందించిన `థ్రిల్ల‌ర్ ` మూవీతో అప్స‌ర‌రాణి ర‌చ్చ చేసిన విష‌యం తెలిసిందే. దీంతో `క్రాక్‌`కి అద‌న‌పు ఆక‌ర్ష‌ణ‌గా వుండాల‌ని అప్స‌ర‌రాణితో క‌లిసి ర‌వితేజ పాల్గొన‌గా జానీ మాస్ట‌ర్ నేథృత్వంలో ఓ మాస్ మ‌సాలా ఐట‌మ్  సాంగ్ ని చిత్రీక‌రిస్తున్నారు.

ఈ విష‌యాన్ని చిత్ర బృందం వెల్ల‌డించింది. స‌ర్‌ప్రైజ్ స‌ర్‌ప్రైజ్ ఏ మాస్ ఐట‌మ్ సాంగ్ లోడింగ్ ఫ్ర‌మ్ కాంబో ర‌వితేజ‌, అప్స‌రరాణి.. జానీ మాస్ట‌ర్ అంటూ ట్వీట్ చేసింది. ర‌వితేజ ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ ఆఫీస‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రాన్ని నెల్లూరులో జ‌రిగిన య‌దార్థ సంఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో తెర‌కెక్కిస్తున్నారు. వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తోంది.