మ‌రోసారి ఈడీ ముందుకు రియా! 

Rhea chakraborthy appear before ed today again
Rhea chakraborthy appear before ed today again

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్ప‌ద మృతి ప‌ట్ల స‌ర్వ‌త్రా అనుమానాలు వ్య‌క్తం కావ‌డంతో కేంద్రం ఈ కేసుని సీబీఐకి అప్ప‌గించిన విష‌యం తెలిసిందే. సుశాంత్ తండ్రి కెకె సింగ్ రాజ్‌పుత్ త‌న త‌న‌యుడి అకౌంట్‌లో వున్న 15 కోట్లు రూపాయ‌లు గ‌ల్లంత‌య్యాయ‌ని, దానికి రియానే ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని ఆరోపిస్తూ కేసు ఫైల్ చేయ‌డంతో ఈడీ రంగంలోకి దిగింది. ఇటీవ‌ల ఈ విష‌య‌మై రియాని ప్ర‌శ్నించిన ఈడీ తాజాగా సోమ‌వారం మ‌రోసారి త‌న ముందు హాజ‌రు కావాల‌ని రియాకు ఆల్టిమేట‌మ్ జారీ చేసింది.

తొలి రోజు ఈడీకి స‌హ‌క‌రించ‌ని రియా సుశాంత్ నుంచి త‌ను సొంతం చేసుకుంది వాట‌ర్ బాటిల్‌, ఓ లెట‌ర్ మాత్ర‌మేన‌ని వెల్ల‌డించి షాకిచ్చింది. అయినా సంతృప్తి చెంద‌ని ఈడీ మ‌రోసారి సోమ‌వారం రియాని ప్ర‌శ్నించాల‌ని డిసైడైంది. ఇదే రోజు రియా ఫాద‌ర్ ఇంద్ర‌జిత్ గుప్తాతో పాటు రియా సోద‌రుడిని కూడా ఈ రోజే ఈడీ ప్ర‌శ్నించ‌బోతోంది. ఈ రోజు వీరి నుంచి కీల‌క స‌మాచారం బ‌య‌టికి వ‌చ్చే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

తమ ముందు హాజ‌రైన రియాను ఈడీ శుక్ర‌వారం 8 గంట‌ల పాటు ప్ర‌శ్నించింది. అయితే రియా నుంచి ఆశించిన స్థాయిలో స‌మాధానం రాక‌పోవ‌డం, ప‌లు సాకులు చెప్పి రియా తప్పించుకోవాల‌ని చూడ‌టంతో మ‌రోసారి ప‌క్కా ఆధారాల‌తో ఈడీ రియాను ప్ర‌శ్నించ‌నున్న‌ట్టు తెలుస్తోంది. ఇదిలా వుంటే రియా పిటీష‌న్ పై సుప్రీమ్‌లో మంగ‌ళ‌వారం తుది విచా‌ర‌ణ జ‌ర‌గ‌నుంది.