ర‌కుల్‌, రానాల‌తో ట‌చ్‌లో వున్న రియా!ర‌కుల్‌, రానాల‌తో ట‌చ్‌లో వున్న రియా!
ర‌కుల్‌, రానాల‌తో ట‌చ్‌లో వున్న రియా!

సుశాంత్ కేసులో రియా చుట్టు ఉచ్చు బిగుస్తోందా? అంటే జ‌రుగుతున్న నాట‌కీయ ప‌రిణామాలు అలాగే క‌నిపిస్తున్నాయి. తాజాగా రియా కాల్ లిస్ట్ సంచ‌ల‌నం సృష్టిస్తోంది.  ముంబై పోలీసుల తీరుతో ఈ కేసుని సీబీఐకి బ‌దిలీ చేయ‌డంతో ప‌లు సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. రియా కాల్ రికార్డ్ బ‌య‌ట‌ప‌డుతోంది. సుశాంత్ మృతి త‌రువాత రియా ఎంత మందికి కాల్ చేసిందో ఆరా తీయ‌డం మొద‌లైంది. ముందుగా ఈ ప‌ని ఓ మీడియా సంస్థ చేయ‌డంతో ప‌లు ఆస‌క్తిక‌రమైన లింకులు బ‌య‌ట‌కు వ‌స్తున్నాయి.

అమీర్‌ఖాన్ తో కూడా రియాకు మంచి అనుబంధం వున్న‌ట్టు క‌నిపిస్తోంది. బాలీవుడ్‌లో మ‌హేష్ భ‌ట్ నుంచి టాలీవుడ్‌లో రానా, ర‌కుల్ ల వ‌ర‌కు రియాకు సంబంధాలు వున్న‌ట్టు తాజ‌గా వెలుగులోకి వ‌స్తోంది. ర‌కుల్‌కు రియా 30 కాల్స్ చేసిన‌ట్టు ఓ జాతీయ మీడియా బ‌య‌ట‌పెట్టిన కాల్ లిస్ట్ ద్వారా బ‌య‌ట‌ప‌డింది. ఇందులో ఏడు సార్లు రానాకు, ర‌కుల్ ప్రీత్ సింగ్ తిరిగి రియాకు 14 సార్లు కాల్ చేయ‌గా రానా కు ఏడు సార్లు కాల్ చేయ‌గా తిరిగి రానా నాలుగు  సార్లు  ఫోన్ చేసిన‌ట్టు బ‌య‌ట‌ప‌డింది. ఇక `ఆషికి 2` హీరో సిద్ధార్ధ్ రాయ్ క‌పూర్‌కి  రియా 16 సార్లు కాల్ చేయ‌గా తిరిగి 7 సార్లు చేసిన‌ట్టు తెలిసింది.

ఇక కాల్ లిస్ట్‌లోకి కీల‌క విష‌యం ఏంటంటే విమ‌ర్శ‌లు ఎదుర్కొని, విచార‌ణ‌కు హాజ‌రైన మ‌హేష్ భ‌ట్‌తో రియా 16 సార్లు ఫోన్‌లో మాట్లాడిన‌ట్టు బ‌య‌ట‌ప‌డిన విష‌యం తెలిసిందే. రియా వీరంద‌రిని ఎందుకు సంప్ర‌దించింది? .. దీని వెన‌కున్న అస‌లు ర‌హ‌స్యం ఏంట‌న్న‌ది మాత్రం బ‌య‌టికి రాలేదు. దీంతో నెటిజ‌న్స్ రియాపై త‌న అనుమానం నిజ‌మేన‌ని త‌మ వాద‌న‌ని బ‌లంగా వినిపిస్తున్నారు. సుశాంత్ ఆత్య హ‌త్య‌కు రియానే అస‌లు సూత్ర‌ధార‌ని సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్నారు.