రియా వ‌ల్ల ఆ కంపెనీకి ఆర్డ‌ర్‌ల వెల్లువ‌!


రియా వ‌ల్ల ఆ కంపెనీకి ఆర్డ‌ర్‌ల వెల్లువ‌!
రియా వ‌ల్ల ఆ కంపెనీకి ఆర్డ‌ర్‌ల వెల్లువ‌!

రియా చ‌క్ర‌వ‌ర్తి.. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా వినిపిస్తున్న పేరిది. సుశాంత్ అనుమానాస్ప‌ద మృతి కార‌ణంగా రియా వార్త‌ల్లో నిలిచింది. ఈ కేసులో డ్ర‌గ్స్ కీల‌క పాత్ర పోషించ‌డంతో నార్కోటిక్స్ డ్ర‌గ్ కంట్రోల్ బోర్డ్ రంగంలోరి దిగింది. రియాని విచార‌ణ‌కు పిల‌వ‌డంతో ఈ కేసులో కొత్త ర‌గ‌డ మొద‌లైంది. ఈ సంద‌ర్భంగా విచార‌ణ‌కు హ‌జ‌రైన రియా టాక్ ఆఫ్ ది ఇండియా కావ‌డం, సోష‌ల్ మీడియా వేదిక‌గా ఆమెపై ప‌లువురు విమ‌ర్శ‌ల‌కు దిగ‌డం, కొంత మంది స‌పోర్ట్‌గా నిల‌వ‌డంతో స‌ర్వ‌త్రా చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

ఈ నేప‌థ్యంలో విచార‌ణ‌కు హాజ‌రైన రియా ధ‌రించిన టీష‌ర్ట్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.  ఈ టీష‌ర్ట్ త‌యారి సంస్థ‌కు ఇప్పుడు ఊపిరి స‌ల‌ప‌ని స్థాయిలో ఆర్డ‌ర్‌లు వ‌స్తున్నాయ‌ట‌. రియా అరెస్ట్ నేప‌థ్యంలో ఆమె టీష‌ర్ట్‌పై “రోజెస్ ఆర్ రెడ్, వైలెట్స్ ఆర్ బ్లూ, లెట్స్ స్మాష్ ది పితృస్వామ్యం, మి అండ్ యు` అని‌ వున్న స్లోగ‌న్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసి అనురా్ క‌శ్య‌ప్‌, విదా్య‌బాల‌న్‌, తాప్సీ, సోన‌మ్ క‌పూర్‌, క‌రీనా క‌పూర్ రియాకు మ‌ద్ద‌తుగా నిలిచారు.

అయితే ఈ స్లోగ‌న్ వున్న ట‌ష‌ర్ట్ నెటిజ‌న్స్‌లో క్రేజ్‌ని ద‌క్కించుకుంది. దీంతో ముంబై బాంద్రాలోని ఈ టీష‌ర్ట్ త‌యారి కంపెనీకి ల‌క్ష‌ల్లో ఆర్డ‌ర్‌లు పోటెత్తుతున్నాయ‌ట‌. ఆర్డ‌ర్‌పై మాత్ర‌మే ఆ సంస్థ టీష‌ర్ట్‌ల‌ని అంద‌మైన స్లోగ‌న్‌ల‌తో త‌యారు చేస్తూ వుంటుంది. ఇప్ప‌డ‌దే స్లోగ‌ర్ రియా కార‌ణంగా వారికి కాసుల వ‌ర్షం కురిపిస్తుండ‌టం చ‌ర్చనీయాంశంగా మారింది.