ఈడీ విచార‌ణ‌కు హాజ‌రైన రియా! 

Rhea chakrobarthy mattends  before Enforsment Directorate
Rhea chakrobarthy mattends  before Enforsment Directorate

సుశాంత్ రాజ్ పుత్ ఆత్మ హ‌త్య కేసుని సీబీఐకి బ‌దిలీ చేయ‌డం రాజ్యాంగ విరుద్ధ‌మ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన రియా చ‌క్ర‌వ‌ర్తి ఆ త‌రువాత త‌ను ఈడీ ముందుకు రాలేన‌ని, సుప్రీమ్‌లో త‌న వాద‌న‌లు పూర్త‌యిన త‌రువాతే ఈడీ త‌న‌ని ప్ర‌శ్నించాల‌ని, అంత వ‌ర‌కు ప్ర‌శ్నించ‌డానికి వీలు లేద‌ని ఏకంగా ఈడీనే రియా కోర‌డం, అందుకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ తిర‌స్క‌రించ‌డంతో శుక్ర‌వారం రియా ఈడీ ముందు హాజ‌రైంది.

సుశాంత్ కేసులో ప్ర‌ధాన ముద్దాయిగా ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న ఈడీ ఇచ్చిన షాక్‌తో రియా చేసేదేమి లేక ఈడీ ముందు హాజ‌రైంది. ఉద‌యం 11:30 గంట‌ల‌కు ఎట్టిప‌రిస్థితుల్లోనూ ముంబైలోని ఆఫీసులో హాజ‌రు కావాల్సిందే అంటూ ఈడీ రియాకు ఆల్టిమేట‌మ్ జారీ చేయ‌డంతో ఎట్ట‌కేల‌కు ఈడీ ముందు హాజ‌రైంది. మ‌నీలాండ‌రింగ్ కేసు కింద ఈడీ రియాని ప్ర‌శ్నించింది. సుశాంత్ ఖాతాలో వున్న 15 కోట్లు రియా మాయం చేసిందంటూ సుశాంత్ తండ్రి కెకె సింగ్ రాజ్ పుత్ కేసు పెట్ట‌డంతో ఈడీ రంగంలోకి దిగిన విష‌యం తెలిసిందే.

అయితే ఈ డ‌బ్బుతో రియా ఫ్యామిలీ ఓ బ‌డా వ్యాపారానికి శ్రీ‌కారం చుట్టింద‌ని, అందులో సుశాంత్‌ని భాగ‌స్వామి చేయాల‌ని పావులు క‌దిపింద‌ని తెలుస్తోంది. దీని వెన‌క పెద్ద కుట్ట‌ర జ‌రిగిందా? ఏ వ్యాపారం కోసం ఇన్న కోట్లు సుశాంత్ నుంచి రియా అకౌంట్‌కి బ‌ద‌లాయించారు అన్న‌దానిపై ఈడీ దృష్టిపెట్టిన‌ట్టు చెబుతున్నారు. రియాతో పాటు ఆమె కుటుంబ స‌భ్యుల‌ని కూడా ఈడీ ప్ర‌శ్నించ‌నుంది.