అంట్లు తోముతున్న కొంతమంది బాలీవుడ్ హీరోలు


అంట్లు తోముతున్న కొంతమంది బాలీవుడ్ హీరోలు
అంట్లు తోముతున్న కొంతమంది బాలీవుడ్ హీరోలు

ఒక విపత్తు వచ్చినప్పుడు రోజు మనం పేపర్లలో టీవీలలో చూస్తూ ఆదర్శవంతంగా ఫీలయ్యే ఎంత మంది జనాలు ప్రస్తుత పరిస్థితులలో ఎలా ప్రవర్తిస్తున్నారు.? అన్న విషయాన్ని అబ్జర్వ్ చేసే నిజంగా వీళ్ళని మనం అభిమానించాలా..? వద్దా..? అన్న సంగతి తెలిసిపోతుంది. భారత దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాపించకుండా ఉండటానికి దేశవ్యాప్తంగా 21 రోజులపాటు లాక్ డౌన్ పాటిస్తున్నారు. నిత్యం సినిమాలు షూటింగ్, మేకప్, డైలాగులు డాన్సులు, ఫైట్లు అంటూ తిరిగే సినిమా తారలు ఇంటికే పరిమితమయ్యారు. వీరిలో కొంతమంది వ్యక్తిగతంగా స్ఫూర్తి కలిగించేలా మరియు ప్రస్తుత పరిస్థితుల గురించి అవగాహన కల్పించడానికి తమ వంతు ప్రయత్నం చేస్తుంటే… కొంతమంది ఎప్పటిలాగే పొట్టి పొట్టి బట్టలు వేసుకుని ఏ పని చేస్తున్నా.. ఎప్పటిలాగే ప్రజలకు స్కిన్ షో చేస్తూ  ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నారు. కొంతమంది బాగా తిట్టుకుంటున్న చైనా వాడి మానసపుత్రిక అయిన “టిక్ టాక్” ఆప్ ను ఇంకా గట్టిగా వాడుతూ.. ఈ సమయంలో కూడా వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడుతున్నారు.

తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ సెలబ్రెటీ కపుల్ జెనీలియా మరియు రితేష్ దేశ్ ముఖ్ కూడా చేరారు. రితేష్ ఇంట్లో పనిచేస్తూ, గిన్నెలు కడగటం చేస్తూ ఉండగా… జెనీలియా వచ్చి కామెడీ చేసే వీడియో ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. జుట్టుకు నల్ల రంగు లేకుండా రితేష్, మొహానికి  తెల్లరంగు లేకుండా జెనీలియా ఈ వీడియోలో చాలా నేచురల్ గా ఉన్నారు. మనం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనాలకు స్పూర్తి కలిగించే పనులు చేసినా చేయకపోయినా పరవాలేదు; కానీ.. ఇంత బాధ్యతారాహిత్యంగా ఉండటం ఎంతవరకు కరెక్టు.? అని నెటిజన్స్  స్పందిస్తున్నారు.

 ఏది ఏమైనా ఈ టిక్ టాక్ ఆప్ నిషేధిస్తే… ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు మందుబాబులు పోటెత్తినట్లు… వందల వేల సంఖ్యలో జనాలు మతిస్థిమితం కోల్పోవడం ఖాయమనే అనిపిస్తోంది.

Credit: Twitter