పెళ్లి చూపులు భామ మూడు సినిమాలను పట్టేసిందిగా


పెళ్లి చూపులు భామ మూడు సినిమాలను పట్టేసిందిగా
పెళ్లి చూపులు భామ మూడు సినిమాలను పట్టేసిందిగా

సినిమా ఎవర్ని ఎప్పుడు ఎలా టర్న్ చేస్తుందో ఎవరూ చెప్పలేరు. పెళ్లి చూపులు సినిమా విడుదలైనప్పుడు ఆ సినిమాలో నటించిన రీతూ వర్మకు అవకాశాలు వెల్లువలా వస్తాయని అందరూ అనుకున్నారు. అంతలా ఆ సినిమాతో ప్రభావం చూపించిందీ భామ. తన నటనతో అందరినీ మెప్పించింది. అయితే రీతూ వర్మకు అవకాశాలు వెల్లువలా ఏమీ రాలేదు. ఏవో ఒకట్రెండు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అయితే చాలా మంది టాలెంటెడ్ హీరోయిన్లలానే రీతూ కూడా కోలీవుడ్ కు షిఫ్ట్ అయిపోయింది. అక్కడ సినిమాలతో బిజీ అయిపోయిన ఈ హీరోయిన్ ఇప్పుడు అనుకోకుండా మళ్ళీ తెలుగు సినిమాల్లో బిజీ అయింది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాల్లో ఛాన్స్ లు పట్టేసింది. అవి కూడా అల్లాటప్పా సినిమాలు కాదు, జనాల్లో బజ్ ఉన్న సినిమాలే. మరి ఈ సినిమాల లిస్ట్ ఏంటో ఒకసారి చూద్దాం.

శర్వానంద్ హీరోగా తెలుగు తమిళ భాషల్లో ద్విభాషా చిత్రం తెరకెక్కుతోంది. ఆ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ నటిస్తోంది. అది కాకుండా న్యాచురల్ స్టార్ నాని నటించనున్న టక్ జగదీష్ సినిమాలో హీరోయిన్ గా రీతూ వర్మ ఎంపికైంది. నాని సినిమాలకు ఉండే బజ్ వేరు. అందులోనూ ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. నిన్ను కోరి, మజిలీ సినిమాలతో ఈ దర్శకుడు తన ప్రతిభను చాటుకున్నాడు. టైటిల్ కూడా వెరైటీగా ఉండి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. షూటింగ్ ఇటీవలే స్టార్ట్ అయింది. జులైలో ఈ చిత్రాన్ని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

ఇక మూడో సినిమా నాగ శౌర్య సరసన మహిళా దర్శకురాలు సౌజన్య తెరకెక్కించనున్న సినిమాలో హీరోయిన్ గా ఎంపికైంది. ఈ సినిమా ఒక ఆహ్లాదకరమైన ప్రేమ కథా చిత్రంగా చెబుతున్నారు. స్క్రిప్ట్ చాలా బాగుంటుందని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్ జరగనుంది. ఈ మూడు చిత్రాలు కూడా ఇదే ఏడాది విడుదల కానున్నాయి. మరి ఈ చిత్రాలతోనైనా రీతూ తెలుగులో బిజీ అవుతుందేమో చూడాలి.