రాఖీభాయ్‌ రొమాంటిక్ బ‌ర్త్‌డే సెలెబ్రేష‌న్స్‌!

రాఖీభాయ్‌ రొమాంటిక్ బ‌ర్త్‌డే సెలెబ్రేష‌న్స్‌!
రాఖీభాయ్‌ రొమాంటిక్ బ‌ర్త్‌డే సెలెబ్రేష‌న్స్‌!

`కేజీఎఫ్‌`.. క‌న్న‌డంలో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో సంచ‌ల‌నాలు సృష్టించింది. హాలీవుడ్ స్థాయి మేకింగ్‌తో భార‌తీయ సినీ ప్రేక్ష‌కుల్ని అబ్బుప‌రిచింది. `బాహుబ‌లి` త‌రువాత యావ‌త్ భార‌తం మరోసారి ద‌క్షిణాదివైపు గ‌ర్వంగా చూసేలా చేసింది. డైన‌మిక్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్, హీరో రాక్‌స్టార్ య‌ష్ ఈ మూవీతో పాన్ ఇండియా స్టార్స్‌గా మారిపోయారు.

ప్ర‌స్తుతం ఈ మూవీకి కొన‌సాగింపుగా `కేజీఎఫ్‌2` వ‌స్తోంది. దీనికి సంబంధించిన టీజ‌ర్ కోసం య‌ష్ అభిమానులు, కేజీఎఫ్ ల‌వ‌ర్స్ ఆత్రుత‌గా ఎదురుచూస్తున్నారు. శుక్ర‌వారం య‌ష్ పుట్టిన రోజు సంద‌ర్భంగా టీజ‌ర్‌ని రిలీజ్ చేయాల‌ని ప్లాన్ చేశారు. కానీ ఎవ‌రో సోష‌ల్ మీడియా వేదిక‌గా టీజ‌ర్‌ని లీక్ చేయ‌డంతో హీరో య‌ష్ ఫీల‌య్యారు. అదే విష‌యాన్ని వివ‌రిస్తూ ఓ వీడియోని కూడా రిలీజ్ చేసిన విష‌యం తెలిసిందే.

ఇదిలా వుంటే ఈ శుక్ర‌వారం హీరో రాక్‌స్టార్ య‌ష్ బ‌ర్త్‌డే. ఈ సంద‌ర్భంగా త‌న బ‌ర్త్‌డేని కుటుంబ స‌భ్యుల‌తో జ‌రుపుకుంటున్నారు. ఈ రోజు ఉద‌య‌మే త‌న భార్య, హీరోయిన్ రాధికా పండిట్‌, పిల్ల‌ల‌తో క‌లిసి కేక్ క‌ట్ చేశారు య‌ష్‌. క‌ట్ చేసిన కేక్‌ని త‌న భార్య కు ప్రేమ‌గా తినిపిస్తున్న రొమాంటిక్ ఫోటో నెట్టింట సంద‌డి చేస్తోంది. య‌ష్ న‌టిస్తున్న సంచ‌ల‌న చిత్రం `కేజీఎఫ్‌2` టీజ‌ర్‌ ఇప్ప‌టికే యూట్యూబ్‌లో సెన్సేష‌న్ క్రియేట్ చేస్తోంది. 30 ప్ల‌స్ మిలియన్‌ల వ్యూస్ దాటి రికార్డు దిశ‌గా ప‌య‌నిస్తోంది.