పంజాగుట్ట‌లో వ‌ర్మ బ్లూ ఫిల్మ్స్ అమ్మే వాడా? Rod gopal varma first look released
Rod gopal varma first look released

మెగా ఫ్యామిలీని టార్గెట్ చేసిన రామ్ గోపాల్ వ‌ర్మ‌ని ఫ్యాన్స్ కూడా ఓ రేంజ్‌లో ఆడుకోవ‌డం మొద‌లుపెట్టారు. వ‌ర్మ ఎలా సినిమాల‌తో కౌంట‌ర్ ఇవ్వాల‌ని ప్లాన్ చేస్తున్నాడో అంత‌కు రెట్టించిన స్థాయిలో టిట్ ఫ‌ర్ టాట్ అన్న‌ట్టుగా మెగా ఫ్యాన్స్ వ‌ర్మ‌పై సినిమాల‌తో యుద్ధం ప్ర‌క‌టించారు. ఇప్ప‌టికే కుప్ప‌లు తెప్ప‌లుగా సినిమాల‌ని ప్ర‌క‌టించేశారు. అందు ఒక‌టి అర విడుల‌య్యాయి కూడా . ష‌క‌ల‌క శంక‌ర్ న‌టించిన సినిమా ఇటీవ‌లే విడుద‌లైంది.

ఆర్జీవి, ప‌రాన్న జీవి, పార్న్ జీవి `పెళ్లాం విదిలేసిన ఓ ద‌ర్శ‌కుడి క‌థ‌, ఎవ‌డ్రా కొట్టింది..వంటి సినిమాల‌ని లైన్‌లో పెట్టారు. ప్ర‌స్తుతం ఇవి నిర్మాణ ద‌శ‌లో వున్నాయి. తాజాగా మ‌రో చిత్రాన్ని ప్ర‌క‌టించారు. `రాడ్ గోపాల్‌వ‌ర్మ‌` అనే పేరుతో కె.ఎస్. మ‌ణి ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. `శివ కి ముందు జ‌రిగిన క‌థ‌` అనే ట్యాగ్ లైన్‌తో ఇంట్రెస్టింగ్ కంటెంట్‌తో ఈ సినిమా రాబోతోంది. ఫ‌స్ట్ లుక్ కూడా ఇంట్రెస్టింగ్ గా వుంది. పోస్ట‌ర్‌పై వ‌ర్మ‌ని పోలిన ఓ వ్య‌క్తి ని పోలీసులు బ‌ట్ట‌లూడ‌దీసి కూర్చో బెట్టిన స్టిల్‌ని ఉద్దేశిస్తూ ` ప‌లు బ్యూ ఫిల్మ్ క్యాసెట్లు అమ్ముతున్న ఓ యువ‌కుడిని అరెస్ట్ చేసిన పంజాగుట్ట పోలీసులు ` అని రాసిన పేప‌ర్ క‌టింగ్‌ని పొందు ప‌రిచి వ‌ర్మ ని ఈ సినిమాతో ఏ రేంజ్‌లో ఆడుకోబోతున్నారో చిన్న హింట్ ఇవ్వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

ఆ రోజు రాత్రి పంజా గుట్ట పోలీస్ స్టేష‌న్‌లో ఏం జ‌రిగిందో  మీకు తెలుసా? ఈ ఫిక్ష‌న‌ల్ రియాలిటీ ఫిల్మ్‌ను ఆస్వాదించ‌డానికి సిద్ధంగా వుండండి. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్ వ‌చ్చేస్తోంది. అని చిత్ర బృందం ప్ర‌క‌టించింది. `శివ‌`కు ముందు జ‌రిగిన క‌థ చెబుతాం అంటుండ‌టంతో ఈ సినిమాపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి ఏర్ప‌డింది. ప్ర‌స్తుతం ఆర్జీవీ `అల్లు` ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ `అల్లు` చిత్రాన్ని నిర్మించే ప‌నిలో వున్నారు.