మెగాస్టార్ చిరంజీవి నాకు స్ఫూర్తి : య‌ంగ్ హీరో రోహిత్ నంద‌న్

మెగాస్టార్ చిరంజీవి నాకు స్ఫూర్తి : య‌ంగ్ హీరో రోహిత్ నంద‌న్
మెగాస్టార్ చిరంజీవి నాకు స్ఫూర్తి : య‌ంగ్ హీరో రోహిత్ నంద‌న్

నో ఐడియా ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై యంగ్ హీరో రోహిత్ నంద‌న్‌, ఇంట‌ర్నేష‌న‌ల్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ జంట‌గా న‌టించిన ప్రైవేట్ సాంగ్‌ `ల‌డిల‌డి`. ఇటీవ‌ల విడుద‌లైన ఈ స్పెష‌ల్ సాంగ్ అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ మాసీ సాంగ్‌కు యువ సంగీత ద‌ర్శ‌కుడు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల సంగీతం అందించారు. బిగ్‌బాస్ 3 విన్న‌ర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పాట‌ని ఆల‌పించారు.

ప్ర‌స్తుతం యూట్యూబ్‌లో ఈ పాట దుమ్ము దులిపేస్తోంది. ఇత‌ర ప్లాట్ ఫామ్స్‌లోనూ విశేషంగా ఆక‌ట్టుకుంటోంది. ఈ సంద‌ర్భంగా హీరో రోహిత్ నంద‌న్ మాట్లాడుతూ .. తాను మెగాస్టార్ చిరంజీవిని స్ఫూర్తిగా తీసుకుని డ్యాన్స్‌, న‌ట‌న‌, త‌దిత‌ర విభాగాల్లో ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ పొందాన‌ని తెలిపారు. లాక్‌డౌన్ స‌మ‌యంలో త‌న స్నేహితుడు శ్రీ‌చ‌ర‌ణ్ పాకాల‌తో క‌లిసి ఈ ల‌డీల‌డీ అనే పాట‌ని ప్లాన్ చేశామ‌న్నారు. ఆ త‌రువాతే ఈ ఆల్బ‌మ్‌లోకి ఇంట‌ర్నేష‌న‌ల్ సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్‌ని, ప్ర‌ముఖ సింగ‌ర్ రాహుల్ సిప్లిగంజ్‌ని తీసుకున్నామ‌న్నారు.

ఈ పాట‌ని ప్ర‌ముఖ కొరియోగ్రాఫ‌ర్ ర‌ఘు మాస్ట‌ర్ త‌న డ్యాన్సింగ్ స్కిల్స్‌తో, లిరిక్ రైట‌ర్ విస్సా ప్ర‌గ‌డ త‌న సాహిత్యంతో మ‌రో లెవెల్‌కి తీసుకెళ్లారు. ఈ పాట ద్వారానే ప్రియా ప్ర‌కాష్ వారియ‌ర్ తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లోకి ఎంట్రీ ఇచ్చార‌ని, ఆమె ఈ పాట‌లో న‌టించ‌డ‌మే కాకుండా పాడ‌టం కూడా జ‌రిగింద‌ని ఈ సంద‌ర్భంగా రోహిత్ నంద‌న్ తెలిపారు. తొలిసారి తాను చేసిన ప్ర‌య‌త్నానికి తెలుగు ప్రేక్ష‌కుల నుంచి విశేష స్సంద‌న ల‌భిస్తోంద‌ని, త్వ‌ర‌లోనే తాను హీరోగా ఓ ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి చిత్రం ద్వారా అరంగేట్రం చేయ‌బోతున్నాన‌ని, దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాన‌ని వెల్ల‌డించారు.