మళ్లీ గెలిచిన రోజా

సినీ నటి రోజా నగరి ఎం ఎల్ ఏ గా మరోసారి గెల్చి సంచలనం సృష్టించింది. తెలుగుదేశం పార్టీలో చేరి రాజకీయ అరంగేట్రం చేసిన రోజా జగన్ పార్టీలో చేరి ఐరన్ లెగ్ అనే ముద్ర వేసుకుంది. రోజా ఎవరి పక్కన ఉంటే ఆ పార్టీ ఓడిపోతుందనే వాదనని పటాపంచలు చేసింది రోజా. నగరి నుండి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన రోజా తాజాగా మళ్లీ అదే స్థానంలో గెలవడంతో ఐరన్ లెగ్ ముద్ర బద్దలైపోయింది.

ఇక జగన్ ముఖ్యమంత్రి అవుతుండటంతో రోజా ని మంత్రి వర్గం లోకి తీసుకోవడం ఖాయమని అంటున్నారు. హోమ్ మంత్రిగా రోజా కు ఛాన్స్ వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రోజా పై తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున వ్యతిరేక ప్రచారం చేసింది , అయినప్పటికీ రోజా మాత్రం విజయం సాధించి పై చేయి సాధించింది. ఇక రోజా గెలవడంతో మంత్రి పదవి కోసం పోటీ మొదలయ్యింది.