రోజా సెల్ ఫోన్ స్విచ్చాఫ్ !


రోజా కు మంత్రిపదవి రాకపోవడంతో తీవ్ర నిరాశకు గురయ్యింది . దాంతో తన సెల్ ఫోన్ లను స్విచ్ఛాఫ్ చేసుకుంది . ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ తన కేబినెట్ ని నిన్న ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే . అయిదుగురు ఉప ముఖ్యమంత్రులను ఏర్పాటు చేసిన జగన్ రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించాడు . అయితే ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ నుండి వచ్చిన అవంతి శ్రీనివాస్ కు మంత్రిపదవి లభించింది కానీ పార్టీ పుట్టకముందు నుండి జగన్ వెంట నడుస్తున్న రోజా కు మాత్రం మంత్రిపదవి లభించకపోవడంతో తీవ్ర షాక్ కి గురయ్యింది అందుకే సెల్ ఫోన్ లను స్విచ్ఛాఫ్ చేసింది .

రోజా కు జగన్ కేబినెట్ లో చోటు లభించకపోవడంతో కేబినెట్ కంటే జగన్ కంటే రోజా టాక్ ఆఫ్ ద స్టేట్ అయ్యింది . రోజా కూడా తప్పకుండ మంత్రిపదవి వస్తుందని అనుకుంది కానీ తీరా సమయానికి జగన్ టీమ్ ఏంటో తెలిసేసరికి రోజా కంటే ఎక్కువగా రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది ఈ సంఘటన . దాంతో ఎక్కడ చూసిన రోజా కు మంత్రిపదవి ఇవ్వకపోవడం పైనే చర్చ జరిగింది , జరుగుతోంది కూడా ……… ….. పాపం రోజా !