రోజా కు మంత్రి పదవి వస్తుందా ?


నటి రోజా నగరి ఎం ఎల్ ఏ గా మరోసారి గెలిచింది దాంతో జగన్ మంత్రివర్గంలో రోజా కు చోటు దొరకడం ఖాయమని వినిపిస్తోంది . కీర్తిశేషులు వై ఎస్ రాజశేఖర్ తన కేబినెట్ లో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చాడు అందునా సబితా ఇంద్రారెడ్డి ని హోమ్ మంత్రిగా నియమించాడు కూడా దాంతో తండ్రి బాటలోనే తనయుడు జగన్ పయనించడం ఖాయమని రోజా కు మంత్రి పదవి ఇవ్వడం ఖాయమని అందునా హోమ్ మినిష్టర్ గా నియమించినా ఆశ్చర్యం లేదని అంటున్నారు .

గత ఎన్నికల్లో నగరి నుండి పోటీ చేసి గెల్చిన రోజా కు అసెంబ్లీ లో ఘోర అవమానం జరిగింది . అసెంబ్లీ లో రోజా ని అడుగుపెట్టకుండా చంద్రబాబు ప్రభుత్వం ఎన్నో ప్రయత్నాలు చేసింది దాంతో రెండేళ్ల పాటు రోజా అసెంబ్లీ కి వెళ్లలేకపోయింది . కట్ చేస్తే ఈసారి ఎన్నికల్లో మళ్ళీ గెల్చి అసెంబ్లీ లో అడుగు పెట్టబోతోంది . అయితే ఈసారి చంద్రబాబు ప్రతిపక్షంలో కూర్చోనున్నాడు . విచిత్రం ఏంటంటే నిన్నటి వరకు అధికారాన్ని వెలగబెట్టిన చంద్రబాబు కి కేవలం 23 స్థానాలు మాత్రమే వచ్చాయి .