పవన్ ఓటమికి చిరంజీవే కారణమంటున్న రోజా


Pawan kalyan shocked with Prabhas fans

పవన్ ఓటమికి చిరంజీవే కారణమంటున్న రోజా

పవన్ కళ్యాణ్ ఓడిపోవడానికి అలాగే జనసేన పార్టీ ఘోరంగా ఓటమి చెందడానికి ముమ్మాటికీ చిరంజీవి మాత్రమే అంటూ పెద్ద బాంబ్ పేల్చింది రోజా . నగరి అసెంబ్లీ స్థానం నుండి రెండోసారి వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా విజయం సాధించిన రోజా కు మంత్రిపదవి వస్తుందని అనుకున్నారు కట్ చేస్తే రోజా కు మంత్రిపదవి లభించలేదు దాంతో షాక్ తిన్న రోజా రెండు రోజులు సెల్ ఫోన్ లు స్విచ్ఛాఫ్ చేసుకొని ఇంట్లోనే ఉండిపోయింది .

రోజా అసంతృప్తితో ఉన్న విషయం గమనించి పిలిపించి మాట్లాడాడు జగన్ , దాంతో మళ్లీ యాక్టివ్ అయ్యింది రోజా . అయితే ఓ మీడియా సంస్థ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై అలాగే చిరంజీవి పై సంచలన వ్యాఖ్యలు చేసింది రోజా . చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి పెద్ద తప్పు చేసాడని అందుకే పవన్ కళ్యాణ్ ను జనాలు అంతగా నమ్మలేదని , జనసేన ఓటమి కి అలాగే పవన్ కళ్యాణ్ ఓటమికి చిరంజీవి మాత్రమే కారణమని కుండబద్దలు కొట్టి మరీ చెబుతోంది రోజా . చిరంజీవి కనుక ప్రజారాజ్యం ని కాంగ్రెస్ లో విలీనం చేయకపోతే ఇప్పుడు పరిస్థితి మరోలా ఉండేదని , పవన్ కళ్యాణ్ ని కూడా నమ్మేవాళ్ళని అంటోంది రోజా . నిజమే ! రోజా చెప్పిన దాంట్లో నిజముంది మరి .