షాక్ కి గురైన రోజా


ఆంధ్రప్రదేశ్ లో వై ఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతో అధికారం చేపట్టడంతో తనకు తప్పకుండా మంత్రిపదవి లభిస్తుందని ఆశించింది ఆర్కే రోజా . నగరి అసెంబ్లీ స్థానం నుండి రెండోసారి తెలుగుదేశం పార్టీని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టింది దాంతో తప్పనిసరిగా జగన్ తన మంత్రివర్గంలో చోటు కల్పిస్తాడు అని భావించింది కానీ అంచనాలను తల్లకిందులు చేస్తూ జగన్ తీసుకున్న నిర్ణయంతో తీవ్ర షాక్ కి గురైంది .

ఒకదశలో కన్నీళ్ల పర్యంతం అయ్యిందట .మంత్రివర్గ లిస్ట్ లో తన పేరు లేకపోవడంతో రోజా అనుచరులు అయితే తట్టుకోలేకపోయారు . తెలుగుదేశం పార్టీ మీద ఒంటరి పోరాటం చేసింది , తనని అసెంబ్లీ లో అడుగు పెట్టకుండా ఎన్ని కుట్రలు పన్నినా ధైర్యంగా ఎదుర్కొంది . తెలుగుదేశం పార్టీ వల్ల మానసికంగా కూడా కృంగిపోయింది . దాంతో జగన్ అన్న ముఖ్యమంత్రి కాగానే తన కష్టాలు తీరిపోతాయి , తన పోరాటానికి న్యాయం జరుగుతుందని ఆశించింది . కానీ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవడంతో ఖిన్నురాలైంది .