కష్టపడ్డాను మంత్రి పదవి రావాల్సిందే : రోజా


పార్టీ పుట్టకముందు నుండి జగన్ తో ఉన్నాను అలాగే పదేళ్ల పాటు పార్టీ కోసం కష్టపడ్డాను , వీధుల్లో పోరాటం చేశాను కాబట్టి తప్పకుండా నాకు మంత్రి పదవి రావాల్సిందే అని అంటోంది నగరి ఎం ఎల్ ఏ , సినీ నటి రోజా . తెలుగుదేశం పార్టీని వీడి వై ఎస్ రాజశేఖర్ రెడ్డి నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వచ్చింది రోజా అయితే అదే సమయంలో వై ఎస్ చనిపోవడంతో అప్పటి నుండి ఐరెన్ లెగ్ ముద్ర తో బాధపడుతూనే ఉంది .

అయితే ఎవరెన్ని విమర్శలు చేసినా , అధికార పార్టీ ఎన్ని నిర్బంధాలు విధించినా రోజా ధైర్యంగా పోరాడింది , ఒకదశలో తీవ్ర మానసిక క్షోభ అనుభవించింది కూడా అయితే ఎన్ని ఇబ్బందులు ఎదురైనా నిలబడి పోరాటం చేసిందే తప్ప వెనకడుగు వేయలేదు , రాజీ పడలేదు దాంతో మరోసారి నగరి నుండి గెలిచింది . ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇన్ని పోరాటాలు చేసిన రోజా కు మంత్రి పదవి ఇవ్వాలని ఆమె అనుచరులు డిమాండ్ చేస్తున్నారు . ఇక రోజా కూడా ఎంతో కష్టపడ్డాను కాబట్టి తప్పకుండా మంత్రి పదవి వస్తుందన్న ధీమాతో ఉంది . మరి జగన్ రోజా కు ఆ అవకాశం కల్పిస్తాడా ? లేదా అన్నది ఈ సాయంత్రానికే తెలిసిపోనుంది ఎందుకంటే రేపే ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గ విస్తరణ .