హీరోయిన్‌గా సీనియ‌ర్ హీరోయిన్ డాట‌ర్‌?

 Rojas daughter ready to enter acting in films
Rojas daughter ready to enter acting in films

టాలీవుడ్‌లో వార‌సుల హ‌వా న‌డుస్తున్న విష‌యం తెలిసిందే. ఇప్ప‌టికే చాలా ంది వార‌సులు ఎంట్రీ ఇండ‌స్ట్రీలో తెరంగేట్రం చేసి స్టార్స్‌గా ప్రేక్ష‌కుల నీరాజ‌నాలందుకుంటున్నారు. కొంత మంది స్టార్స్‌గా మార‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇదిలా వుంటే మ‌రో వార‌సురాలు తెరంగేట్రంపై గ‌త కొన్ని రోజులుగా చ‌ర్చ జ‌ర‌గుతోంది. ఆ వార‌సురాలు మ‌రెవ‌రో కాదు అప్ప‌ట్లో స్టార్ హీరోయిన్‌గా తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఓ వెలుగు వెలిగిన రోజా కూతురిని ప్ర‌చారం మొద‌లైంది.

నటి రోజా కుమార్తె అన్షు మాలికా రోజా సెల్వమణి టీనేజ్‌లోనే ఉంది. అనుషు మల్లికాకు త‌ల్లి రోజా పోలిక‌లు రాక‌పోయినా ఆమెను మించిన అందం అన్షు సొంతం. హీరోయిన్ కావాల్సిన అర్హ‌త‌ల‌న్నీ ఆమెలో వున్నాయి. అందంలో ప్ర‌స్తుతం వున్న హీరోయిన్‌ల‌కు ఏమాత్రం తీసిపోదు. ఇప్పటికే తన అందంతో చూప‌రుల‌ని ఆక‌ట్టుకుంటోంది. అంతే కాకుండా సోషల్ మీడియాలో ఆమె భారీ స్థాయిలోనే అభిమానులను సంపాదించింది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె తెరంగేట్రానికి సంబంధించిన రోజా ఎలాంటి ప్ర‌క‌ట‌న గానీ, అలాంటి ఆలోచ‌న త‌న‌కు వుంద‌ని కానీ వెల్ల‌డించ‌లేదు. అయితే అన్షు తల్లి రోజా అడుగుజాడల్లో నడుస్తుందా?..అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. సినీ రంగ ప్ర‌వేశంపై అన‌షుని ఆమె స‌న్నిహితులు ప్ర‌శ్నిస్తే నటిగా అరంగేట్రం చేసే అవకాశాన్ని ఆమె ఖండించలేదు.. చేస్తాన‌ని ధృవీకరించలేదు.