`రొమాంటిక్` డేట్ వ‌చ్చేసింది!

Romantic and Most eligible bachelore clash on boxoffice
Romantic and Most eligible bachelore clash on boxoffice

హీరో ఆకాష్ పూరి రెండవ చిత్రం `రొమాంటిక్`.  చాలా కాలం క్రితం షూట్ పూర్త‌యినా ఈ మూవీ రిలీజ్ విష‌యంలో టీమ్ ఆచి తూచి వ్య‌వ‌హ‌రిస్తూ వ‌స్తోంది. కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోంది. పూరీ జగన్నాథ్‌ టూరింగ్ టాకీస్ అండ్‌ పూరి కనెక్ట్స్ బ్యానర్‌ల కింద పూరీ జగన్నాథ్, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిల్ పదురి దర్శకత్వం వహించారు.

ఎట్ట‌కేల‌కు ఈ మూవీ విడుదలకు సిద్ధమవుతోంది. ఈ విష‌యాన్ని చిత్రం బృందం సోమ‌వారం అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం జూన్ 18 న థియేటర్లలో విడుదల కాబోతోంద‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఒక్క రోజు తేడాతో అఖిల్ న‌టించిన `మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్` రిలీజ్ అవుతోంది. అంటే ఈ ఇద్ద‌రికి బాక్సాఫీస్ వ‌ద్ద క్లాష్ త‌ప్ప‌ద‌న్న‌మాట‌.

రొమాంటిక్ విడుదలైన ఒక రోజు తర్వాత జూన్ 18 న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ థియేట‌ర్ల‌లోకి రానుంది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ రెండు చిత్రాలు యువ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. సునీల్ కశ్యప్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, మకరంద్ దేశ్‌పాండే ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.