పూరీ పాప‌ మ‌రో ఆఫ‌ర్ కొట్టేసింది!


పూరీ పాప‌ మ‌రో ఆఫ‌ర్ కొట్టేసింది!
పూరీ పాప‌ మ‌రో ఆఫ‌ర్ కొట్టేసింది!

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు పూరి ఆకాష్ హీరోగా న‌టిస్తున్న `రొమాంటిక్‌`. ఈ చిత్రంతో ఢిల్లీకి చెందిన హాట్ గ‌ళ్ కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా ప‌రిచ‌యం అవుతోంది. డ‌బుష్మాష్ వీడియోలాతో పాపుల‌ర్ అయిన కేతిక తొలిసారి న‌టిస్తున్న చిత్ర‌మిది. తొలి మూవీ చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వుండ‌గానే టాలీవుడ్‌లో మ‌రో ఆఫ‌ర్‌ని సొంతం చేసుకుంది.

సోష‌ల్ మీడియాలో హాట్ హాట్ ఫొటోల‌తో నెటిజ‌న్స్‌ని ఆక‌ట్టుకుంటూ ఇంట‌ర్నెట్‌ని హీటెక్కించేస్తున్న కేతిక శ‌ర్మ తాజాగా యంగ్ హీరో నాగ‌శౌర్య‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేసింది. నాగ‌శౌర్య‌ హీరోగా `సుబ్ర‌మ‌ణ్య‌పురం` ఫేమ్ సంతోష్ జాగ‌ర్ల‌పూడి ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంలో నాగ‌శౌర్య‌కు జోడీగా కేతిక శ‌ర్మ‌ని ఫైన‌ల్ చేశార‌ట‌.

ల‌వ్‌స్టోరీ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రాన్ని శ‌ర‌త్ మ‌రార్ , నార‌య‌ణ్‌దాస్ నారంగ్, పుస్కూర్ రామ్మోహ‌న్‌రావు సంయుక్తంగా నిర్మించ‌బోతున్నారు. గ‌త ఏడాది అక్టోబ‌ర్‌లోనే  ఈ చిత్రాన్ని సైలెంట్‌గా స్టార్ట్ చేశారు. `రొమాంటిక్‌` స్టిల్స్‌లో కేతిక‌ని చూసిన ద‌ర్శ‌కుడు ఈ చిత్రం కోసం ఎంపిక చేసిన‌ట్టు తెలిసింది.