యూట్యూబ్ లో సరికొత్త చరిత్ర సృష్టించిన రౌడీ బేబీ


Rowdy baby song creates New Sensation in Youtube
Rowdy baby song creates New Sensation in Youtube

రౌడీ బేబీ పాట సృష్టిస్తున్న చరిత్ర అంతా ఇంతా కాదు.

ఇప్పటివరకు ఏ పాటకు రాని వ్యూస్ రౌడీ బేబీ పాటకు వచ్చాయి.

ఇంతకీ ఈ పాటకి వచ్చిన వ్యూస్ ఎన్నో తెలుసా …….. 600 మిలియన్ వ్యూస్.

వినడానికి , అనడానికి చాలా ఆశ్చర్యంగా అనిపించినప్పటికీ ఇది నిజమే ! ధనుష్ – సాయి పల్లవి జంటగా నటించిన మారి 2 చిత్రంలోని పాట ఈ రౌడీ బేబీ.

ప్రారంభం నుండే సంచలనాలు నమోదు చేస్తున్న ఈ పాట తాజాగా 600 మిలియన్ వ్యూస్ సాధించడం అంటే సరికొత్త చరిత్ర సృష్టించినట్లే!

అయితే ఈ పాట బాగా పాపులర్ అయ్యింది కానీ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

అయితే ఆలోటుని ఇలా పాట భారీ హిట్ కొట్టడం ద్వారా భర్తీ చేస్తోంది.

ఈ పాటలో ధనుష్ – సాయి పల్లవి ల డ్యాన్స్ కూడా అదరహో అనేలా ఉంటుంది మరి.