హీరో ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారట


rowdy cycle ravi murder attempt on hero yash

కన్నడ యంగ్ హీరో యష్ ని మర్డర్ చేయడానికి ప్లాన్ చేశారట రౌడీ షీటర్ సైకిల్ రవి . సంచలనం సృష్టించిన ఈ సంఘటనని బెంగుళూర్ పోలీసులు చేధించారు . కన్నడంలో పలు చిత్రాల్లో నటించిన యష్ ని చంపేయాలని రౌడీ సైకిల్ రవి తో పాటు కోదండరామ వ్యూహం పన్నారట . అయితే అది ఇప్పుడు కాదు రెండేళ్ల క్రితమట ,ఓ కన్నడ నిర్మాతకు హీరో యష్ కు మధ్య జరిగిన గొడవలో భాగంగా యష్ ని మర్డర్ చేయాలనీ పథకం పన్నారట రౌడీషీటర్లు . అప్పుడే ఈ విషయం పై అనుమానం వచ్చిన యష్ నేరుగా పోలీస్ ఉన్నతాధికారులను సంప్రదించి ఫిర్యాదు చేసాడు .

అయితే అప్పట్లో రౌడీ సైకిల్ రవి , కోదండ రామ పోలీసులకు దొరకలేదు ఇటీవలే రౌడీ సైకిల్ రవి ని మాత్రం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అయితే కోదండ రామ మాత్రం ఇంతవరకు పోలీసులకు దొరకలేదు . ప్రస్తుతం రౌడీ సైకిల్ రవి ని విచారణ చేస్తున్నారు పోలీసులు , రెండేళ్ల క్రితం ప్లాన్ చేసిన సంఘటన కానీ ఇప్పుడు వాళ్లకు యష్ ని చంపాలన్న ఉద్దేశ్యం లేదని అంటున్నారు పోలీసులు .

ఇక నటుడు యష్ కూడా ఈ మర్డర్ పాన్ ని లైట్ గా తీసుకుంటున్నాడు ఎందుకంటే వాళ్ళు నన్ను చంపాలని అనుకున్నది నిజమే కానీ అది ఇప్పుడు కాదు రెండేళ్ల క్రితం పైగా ఆ సమస్య పరిష్కారం అయ్యింది కాబట్టి నాకు ఎటువంటి ప్రాణహాని లేదని చెబుతున్నాడు .

English Title: rowdy cycle ravi murder attempt on hero yash