రెమ్యునరేషన్ పెంచిన రష్మిక మందన్న


Rashmika Mandanna
Rashmika Mandanna

వరుస విజయాలు సాధిస్తున్న రౌడీ రాణి రష్మిక మందన్న తన రెమ్యునరేషన్ ని అమాంతం పెంచేసింది . నలభై లక్షలు మాత్రమే ఎక్కువ అనుకునే రేంజ్ నుండి ఏకంగా కోటి రూపాయల రేంజ్ కు వచ్చాను అని అంటోంది రష్మిక . అయితే దర్శక నిర్మాతలు ఒత్తిడి చేస్తుండటంతో ప్రస్తుతం అయితే 80 లక్షలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని పట్టుబడుతోందట .

రష్మిక మందన్న తన రేటు ని పెంచడంతో దర్శక నిర్మాతలు గగ్గోలు పెడుతున్నారు . అయితే రష్మిక మందన్న కు డిమాండ్ ఉండటంతో కొంతమంది ఆ మొత్తం ఇవ్వడానికి అంగీకరిస్తున్నారు . ఇక ఇప్పుడేమో డియర్ కామ్రేడ్ విడుదలకు సిద్ధంగా ఉంది అందునా నాలుగు బాషలలో . తెలుగు , తమిళ , మలయాళ , కన్నడ బాషలలో హిట్ అయితే ఇంకా పెద్ద మొత్తంలో రేటు పెంచడం ఖాయం . డిమాండ్ ఉన్నప్పుడు రెమ్యునరేషన్ పెంచితే తప్పేంటి ? అని అంటోంది రష్మిక మందన్న .