ముంబైలో అర్థ్ర‌రాత్రి రౌడీ ఏం చేస్తున్నాడు?


Rowdy hero on mumbai roads
Rowdy hero on mumbai roads

`వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్` నికాశ ప‌ర‌చ‌డంతో కొత్త సినిమాపై పూర్తి స్థాయిలో దృష్టిసారించాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో విజ‌య్ ఓ భారీ చిత్రం చేస్తున్న విష‌యం తెలిసిందే. క‌ర‌ణ్ జొహార్‌, అపూర్వ మెహ‌తాతో క‌లిసి పూరిజ‌గ‌న్న‌థ్‌, చార్మి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విజ‌య్ చేతిలో సినిమాలు లేక‌పోవ‌డంతో ఈ మూవీ షూటింగ్‌ని స్పీడ‌ప్ చేసేశారు.

ప్ర‌స్తుతం ముంబై వీధుల్లో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. అర్థ్రా రాత్రి షూటింగ్ చేస్తున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ, అన‌న్య పాండే బైక్‌పై వెళుతుండ‌గా ఛేజింగ్ సీన్‌ల‌ని ద‌ర్శ‌కుడు పూరి జ‌గ‌న్నాథ్ తెర‌కెక్కిస్తున్నారు. ఈ షూటింగ్‌లో ముంబై వీధుల్లో రౌడీ హీరో హ‌ల్ చేస్తుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. దీనికి పంబంధించిన ఫొటోలు ఇంట‌ర్నెట్‌లో హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ బైక్ న‌డుపుతుండ‌గా కొన్ని స‌న్నివేశాల్లో వెన‌క భాగంలో కూర్చుని క‌నిపిస్తున్న అన‌న్య పాండే మ‌రో ఫొటోలో బైక్ ట్యాంక్‌పై కూర్చుని క‌నిపిస్తున్న ఫొటోలు ఆక‌ట్టుకుంటున్నాయి.

సినిమాలో వీరిద్ద‌రి మ‌ధ్య కెమిస్ట్రీ య‌మ కిర్రాక్‌గా వుండ‌బోతోంద‌ని ఈ ఫొటోల‌ని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ ఫైట‌ర్‌గా న‌టిస్తున్న ఈ చిత్రం కోసం పూరి భారీ స్థాయిలో యాక్ష‌న్ సీన్స్‌ని ప్లాన్ చేశార‌ట‌. అవి సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయ‌ని తెలిసింది.