
దక్షణిణాది తెరపై వస్తున్న మరో వండర్ `ఆర్ఆర్ఆర్`. దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో కొమరం భీం పాత్రలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగాపవర్‌స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్‌ని ఇటీవలే రామ్‌చరణ్ , ఎన్టీఆర్‌లు పాల్గొనగా ప్రారంభించామంటూ చిత్ర బృందం ప్రకటించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌లోని ఆర్ ఎఫ్‌సీలో ప్రస్తుతం పతాక ఘట్టాల్నితెరకెక్కిస్తున్నారు
ఈ ఫైట్‌లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ అబ్బుర పరిచే విన్యాసాలతో గూస్ బంప్స్ తెప్పిస్తారని, ఈ రోమాంచితమైన క్లైమాక్స్ ఘట్టాల్ని స్వయంగా రాజమౌళి కంపోజ్ చేసి మరీ ఫైట్ మాస్టర్‌కు వివరిస్తున్నారని తెలిసింది. దేశ భక్తి ప్రధానంగా 1920 కాలం నేపథ్యంలో రోమాంచిత ఘట్టాలతో ఈ మూవీని రాజమౌళి తెరకెక్కిస్తున్నారు. క్లైమాక్స్ ఘట్టాలు, ఎన్టీఆర్ పులి ఫైట్.. బ్రిటీష్ పోలీస్ గెటప్‌లో రామ్‌చరణ్ బ్రిటీష్ వారిని బురిడీ కొట్టించే అనేక ఘట్టాలు రోమాంచితంగా వుంటాయని తెలుస్తోంది.