ఓటు కోసం షూటింగ్ ని పక్కన పెట్టాడు


RRR first schedule completed
S.S. Rajamouli, NTR and Ram Charan

ఓటు వేయడానికి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ని పక్కన పెట్టాడు దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి . తాజాగా ఈ దర్శకుడు ఎన్టీఆర్ – రాంచరణ్ లతో భారీ మల్టీస్టారర్ చిత్రాన్ని చేస్తున్న విషయం తెలిసిందే . ఇటీవలే ప్రారంభమైన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నవంబర్ 19 నుండి జరిగింది . అయితే ఈ షెడ్యూల్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ చేసారు జక్కన్న . ఎన్టీఆర్ చరణ్ లపై తీసిన యాక్షన్ ఎపిసోడ్ కు ఏకంగా 20 మంది ఫైట్ మాస్టర్ లను పెట్టడం సంచలనం సృష్టిస్తోంది .

ఒక్క ఫైట్ కోసం 20 మంది ఫైట్ మాస్టర్ లను పెట్టారంటే ఈ యాక్షన్ సీన్ ఎంతగా ప్రభావితం చేస్తుందో అర్ధం చేసుకోవచ్చు . ఎన్టీఆర్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మూడు చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి . అలాగే చరణ్ – రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన మగధీర బ్లాక్ బస్టర్ అయ్యింది దాంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి . ఇక ఈరోజు తెలంగాణాలో ఎన్నికల పోలింగ్ కాబట్టి నిన్నటితో ఆర్ ఆర్ ఆర్ చిత్ర షూటింగ్ ని కంప్లీట్ చేసి ఓటు వేయడానికి సిద్దమయ్యాడు జక్కన్న అండ్ కో .

English Title: RRR first schedule completed.