పులితో యంగ్ టైగర్- వంద మందితో మెగా పవర్


పులితో యంగ్ టైగర్- వంద మందితో మెగా పవర్
పులితో యంగ్ టైగర్- వంద మందితో మెగా పవర్

“నా సినిమాలలో ఒక సాధారణమైన హీరోనే ఒక రేంజ్ లో చూపించే నేను..అలాంటిది ఇప్పుడు నేను తీసేది ఇద్దరు యోధుల గురించి కాబట్టి హీరోలని ఎలా చూపిస్తానో మీ ఊహకే వదిలేస్తున్న” అన్నాడు దర్శకధీరుడు “ఎస్.ఎస్.రాజమౌళి” గారు. ఆర్.ఆర్.ఆర్. సినిమా విడుదల రోజు ప్రకటించే టైములో మీడియా ముందు ఆయన చెప్పిన మాటలు ఇంకా మన అందరికి గుర్తున్నాయి.

ఇప్పుడు అదే మాట ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పైగా హీరోల పరిచయ సన్నివేశాలు కూడా ఇప్పుడే చిత్రీకరిస్తున్నారు కూడా. ఆర్.ఆర్.ఆర్ సినిమా లో యంగ్ టైగర్ జూ.ఎన్.టి.ఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు వారి వారి పాత్రల పరంగా చూపించబోతున్నారు. ఆ పరిచయ సన్నివేశాలు కూడా కథలో కీలకం కాబట్టి జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు సినిమా సభ్యులు.

అయితే ఈ సినిమాలో జూ.ఎన్.టి.ఆర్ గారిని పులితో ఫైట్ చేసే కొమరం భీం గా చూపించగా, రామ్ చరణ్ ని 100 మందితో పోరాడి గెలిచిన వీరుడు అల్లూరి సీత రామ రాజు గా చూపించబోతున్నారు. బాహుబలి లాంటి చరిత్ర సృష్టించిన సినిమా తర్వాత రాజమౌళి తీస్తున్న సినిమా కాబట్టి జనాలకి ఆర్.ఆర్.ఆర్ సినిమా మీద బారి అంచనాలు ఉన్నాయి.

సినిమాకి సంగీత దర్శకులు ఎం.ఎం.కీరవాణి గారు. రాజమౌళి పాత సినిమాలకి పని చేసిన వారు ఈ ఆర్.ఆర్.ఆర్ సినిమాకి యధావిధిగా కొనసాగుతున్నారు. సినిమాలో ముఖ్యమైన పాత్రల్లో సముద్రఖని, అజయ్ దేవగన్, అలియా భట్, లాంటి వాళ్ళు సినిమాకి అదనపు బలంగా చిత్రీకరిస్తున్నారు రాజమౌళి గారు. ఈ సినిమా వచ్చే ఏడాది 30 జులై న విడుదల కాబోతుంది. సినిమాకి నిర్మాత డి.వి.వి. దానయ్య గారు.అయితే ఆర్.ఆర్. ఆర్ అనగా “రామ రౌద్ర రుషితం”, “రామ రావణ రాజ్యం” అని పలు పేర్లు ప్రచారంలో ఉన్నాయి.