దేశ ప్ర‌జ‌ల‌కు `ఆర్ఆర్ఆర్‌` టీమ్ విజ్ఞ‌ప్తి!

దేశ ప్ర‌జ‌ల‌కు `ఆర్ఆర్ఆర్‌` టీమ్ విజ్ఞ‌ప్తి!
దేశ ప్ర‌జ‌ల‌కు `ఆర్ఆర్ఆర్‌` టీమ్ విజ్ఞ‌ప్తి!

క‌రోనా మ‌న దేశాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. ఎక్క‌డా చూసినా కోవిడ్ మ‌ర‌ణాలే తాండ‌విస్తున్నాయి. ఆక్సిన్ లేక కొంత మంది చ‌నిపోతుంటే మ‌రి కొంత మంది స‌రైన వైద్యం అంద‌క‌, ఆసుప‌త్రుల్లో బెడ్ లు ల‌భించ‌క మృత్యువాత ప‌డుతున్నారు. నిత్యం దేశ వ్యాప్తంగా ల‌క్ష‌ల్లో కేసులు న‌మోద‌వుతుండగా వేల‌ల్లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. గ‌తంలో పోలిస్తే సెకండ్ వేవ్ మృత్యు గంటిక‌లు మోగిస్తోంది.

ఈ నేప‌థ్యంలో ఆప్ర‌మ‌త్త‌తే మ‌న‌కు శ్రీ‌రామ ర‌క్ష అంటున్నారు `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్‌. కోవిడ్ విల‌యం నుంచి మ‌న‌ల్ని మ‌నం కాపాడుకుంటూ మ‌న వారిని ర‌క్షించుకోవాలంటే అదొక్క‌టే మార్గ‌మ‌ని చెబుతున్నారు. ఈ సంద‌ర్భంగా ఐదు భాష‌ల్లో `ఆర్ ఆర్ ఆర్‌` టీమ్ ద‌ర్శ‌కుడు ఎస్‌.ఎస్‌. రాజ‌మౌళి, కీల‌క పాత్ర‌ధారి అజ‌య్‌దేవ‌గ‌న్‌, హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌, హీరోయిన్ అలియాభ‌ట్ చేసిన వీడియో ప్ర‌స్తుతం నెట్టింట సంద‌డి చేస్తోంది.

అలియాభ‌ట్ తెలుగులో, రామ్‌చ‌ర‌ణ్ త‌మిళంలో, ఎన్టీఆర్ క‌న్న‌డంలో, రాజ‌మౌళి మ‌ల‌యాళంలో, అజ‌య్ దేవ‌గ‌న్ హిందీలో క‌రోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల గురించి వివ‌రిస్తూ ఓ వీడియో సందేశాన్ని అందించారు. దేశంలో క‌రోనా ప్ర‌మాద ఘంటిక‌లు మోగిస్తున్న వేళ మాస్కు త‌ప్ప‌కుండా ధ‌రించాలని, వ్యాక్సిన్ వేయించుకోవాల‌ని సూచించారు. ఈ వీడియో నెట్టింట వైర‌ల్‌గా మారింది.