ఆర్ ఆర్ ఆర్ రిలీజ్.. సంక్రాంతికే అంటున్నారే


rrr new release date update
rrr new release date update

సంక్రాంతికి ఇప్పటికే ఐదు సినిమాలు విడుదలవుతున్నాయి. ఆర్ ఆర్ ఆర్ ఎలా వస్తుంది.. అయినా షూటింగ్ ఇంకా చాలా చేయాల్సింది ఉందిగా. అప్పుడే రిలీజ్ ఏంటి అని కంగారు పడిపోకండి, ఇక్కడ మాట్లాడేది 2020 సంక్రాంతి గురించి కాదు 2021 సంక్రాంతి గురించి. నిజానికి ఆర్ ఆర్ ఆర్ జులై 30 2020న విడుదల చేస్తానని రాజమౌళి చాలా నెలల క్రితమే ప్రకటించాడు. ప్రతిసారి రిలీజ్ డేట్ విషయంలో మాట తప్పే రాజమౌళి ఈసారి మాత్రం మాట మీద నిలబడతాను అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. మొదట కొంత సందేహించినా అందరూ ఆ సమయానికి నమ్మారు.

అయితే ఇప్పుడు చూస్తుంటే ఆర్ ఆర్ ఆర్ అనుకున్న తేదికి వచ్చేలా కనిపించట్లేదు. అటు రామ్ చరణ్ కు, ఇటు ఎన్టీఆర్ కు ఒకరి తర్వాత ఒకరికి గాయాలవడంతో షెడ్యూల్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. దాని తర్వాత రామ్ చరణ్ సైరా ప్రమోషన్స్ లో బిజీ అయిపోయాడు. దీంతో షూటింగ్ అనుకున్నదాని కన్నా చాలా డిలే అవుతుందని తెలుస్తోంది.

ఇందుకే సేఫ్ గా మరో డేట్ ను లాక్ చేస్తున్నారని తెలుస్తోంది. జులై మిస్ అయితే వచ్చే సంక్రాంతికి రావడం బెటర్ అని యూనిట్ సభ్యులు అభిప్రాయపడడంతో 2021 సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ విడుదల కానుంది. రాజమౌళి సినిమా రిలీజ్ డేట్ ను మిస్ చేసినా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం మాత్రం మిస్ చేయడు.