భారీ యాక్షన్ సీన్స్ కోసం బల్గేరియా వెళ్లిన ఎన్టీఆర్


Jr Ntr
Jr Ntr

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ భారీ యాక్షన్ సీన్స్ కోసం బల్గేరియా వెళ్ళాడు . తాజాగా ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే . కాగా ఆ సినిమా షూటింగ్ కోసం బల్గేరియా వెళ్ళాడు జూనియర్ . బల్గేరియా లో ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ దాదాపు నెలరోజుల పాటు జరుగనుంది . జూనియర్ ఎన్టీఆర్ తో పాటుగా కొంతమంది ఫైటర్ లపై భారీ ఎత్తున ఫైటింగ్ సీన్స్ తో పాటుగా ఛేజింగ్ సీన్స్ కూడా తీయనున్నారట జక్కన్న .

ఈ షెడ్యూల్ నెల రోజుల పాటు బల్గేరియా లో సాగనుంది , ఇక జూనియర్ ఎన్టీఆర్ మాత్రమే ఈ షూటింగ్ లో పాల్గొననున్నాడు . రాంచరణ్ కు ఈ షెడ్యూల్ లో పని లేకుండాపోయింది . దాంతో సైరా ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొననున్నాడు ఈ నెల రోజులు . జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్న విషయం తెలిసిందే . ఆర్ ఆర్ ఆర్ కొత్త షెడ్యూల్ బల్గేరియా లోప్రారంభం కావడంతో ఆర్ ఆర్ ఆర్ టీమ్ లో సరికొత్త జోష్ వచ్చింది . డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని 2020 జూలై లో విడుదల చేయడానికి ముహూర్తం నిర్ణయించారు .