ఆర్ ఆర్ ఆర్ టైటిల్ రాజసం


RRR official title Rajasam
దర్శకులు ఎస్ ఎస్ రాజమౌళి భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఎన్టీఆర్రాంచరణ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి వర్కింగ్ టైటిల్ గా ఆర్ ఆర్ ఆర్ అని పెట్టారు . దాంతో రామ రావణ రాజ్యం అని వినబడింది ఇక ఇప్పుడేమో రాజసం అనే టైటిల్ ని పెట్టినట్లుగా తెలుస్తోంది . అయితే రాజమౌళి అండ్ కో అధికారికంగా ప్రకటిస్తేనే అది అధికారిక టైటిల్ అవుతుంది లేకపోతే ఇలా ఊహాగానాలు వస్తూనే ఉంటాయి .

ఇప్పటికే ఒక షెడ్యూల్ ని పూర్తిచేసుకున్న ఆర్ ఆర్ ఆర్ అప్పుడే ప్రకంపనలు సృష్టిస్తోంది . తెలుగు , తమిళ , మలయాళ , హిందీ బాషలలో ఈ చిత్రం విడుదల కానుంది . ఎన్టీఆర్ , రాంచరణ్ ల కెరీర్ లో ఆర్ ఆర్ ఆర్ చిరస్థాయిలో నిలిచిపోవడం ఖాయమని అంటున్నారు . ఇక ఈ సినిమా పూర్వ జన్మల నేపథ్యంలో రూపొందుతోంది అని తెలుస్తోంది . ఎం ఎం కీరవాణి సంగీతం అందించనున్న ఈ చిత్రాన్ని 2020 లో విడుదల చేయనున్నారు .

English Title: RRR official title Rajasam