ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ సాంగ్ షూట్ షురూ

RRR promotional song shoot underway
RRR promotional song shoot underway

ప్రమోషన్స్ విషయంలో ఎస్ ఎస్ రాజమౌళి ఆలోచనలు వేరే లెవెల్లో ఉంటాయి. సినిమాకు హైప్ తీసుకురావడం ఎలానో జక్కన్నకు తెలిసినంతగా మరొకరికి తెలియదేమో. బాహుబలి విషయంలో కాన్సెప్ట్ పోస్టర్ లు వదిలి అందరి దృష్టిని ఆకర్షించిన రాజమౌళి ఇప్పుడు ఆర్ ఆర్ ఆర్ విషయంలో ప్రమోషన్స్ పై దృష్టి పెట్టాడు.

ఈరోజు నుండి ఆర్ ఆర్ ఆర్ ప్రమోషనల్ సాంగ్ షూట్ షురూ అయింది. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్ లో స్పెషల్ గా వేసిన సెట్ లో ఈ సాంగ్ షూట్ జరుగుతుంది. ప్రధాన కాస్ట్ అండ్ క్రూ ఈ సాంగ్ షూట్ లో పాల్గొంటున్నారు. ఈ సాంగ్ ను ప్రమోషన్స్ లో వాడతారు. అంతే కాకుండా సినిమా లాస్ట్ లో కూడా ఈ సాంగ్ ను క్రెడిట్స్ తో కలిపి ప్లే చేస్తారు.

మరో సాంగ్ ను యూరోప్ లో చిత్రీకరిస్తారు. అక్టోబర్ 13న ఆర్ ఆర్ ఆర్ భారీ లెవెల్లో విడుదల కానుంది.