ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్

ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్
ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ ను మొదలుపెట్టిన రామ్ చరణ్

తెలంగాణలో లాక్ డౌన్ ను పూర్తిగా ఎత్తేసారు. పరిస్థితి అదుపులో ఉన్న కారణంగా ఎటువంటి నిబంధనలను విధించట్లేదు. దీంతో టాలీవుడ్ తిరిగి వర్క్ మోడ్ లోకి వచ్చేసింది. చాలా సినిమాల షూటింగ్స్ మొదలవుతున్నాయి. కొన్ని చిత్రాలు జులై మొదటి వారం నుండి మొదలుకానున్నాయి.

తాజా సమాచారం ప్రకారం ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ కూడా ఈరోజు నుండి మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటో ఒకటి ఇప్పుడు వైరల్ అయింది. రామ్ చరణ్ ఈ పిక్ లో షార్ప్ లుక్స్ తో అదరగొడుతున్నాడు. ముంబై నుండి ప్రముఖ హెయిర్ స్టైలిస్ట్ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ హెయిర్ స్టైలిస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.

ఆయన ట్వీట్ ద్వారానే ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ మొదలైందని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ ఒక్కడే షూటింగ్ లో పాల్గొంటుండగా, త్వరలోనే ఎన్టీఆర్ కూడా జాయిన్ అవుతాడని తెలుస్తోంది. ఆర్ ఆర్ ఆర్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నాడు రాజమౌళి.