`2.O` నిర్మాత‌ల‌కి `ఆర్ఆర్ఆర్‌` రైట్స్‌!

`2.O` నిర్మాత‌ల‌కి `ఆర్ఆర్ఆర్‌` రైట్స్‌!
`2.O` నిర్మాత‌ల‌కి `ఆర్ఆర్ఆర్‌` రైట్స్‌!

`బాహుబ‌లి` చిత్రంతో ద‌క్షిణాది స‌త్తాని యావ‌త్ దేశంతో పాటు ప్ర‌పంచానికి చాటారు ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి. ఈ సినిమాతో టాల‌వుడ్ సినిమా స్థాయి, మార్కెట్ ఒక్క‌సారిగా భారీ స్థాయికి చేరిపోయింది. దీంతో తెలుగు నుంచి సినిమా అంటే దేశ వ్యాప్తంగా ఆస‌క్తి నెల‌కొంటోంది. ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు మ‌న చిత్రాల్ని డిస్ట్రిబ్యూట్ చేయ‌డానికి ఎంక్వైరీల‌తో పాటు పోటీప‌డుతున్నారు.

తాజాగా ఇదే త‌ర‌హా పోటీ `ఆర్ఆర్ఆర్‌` చిత్రంపై నెల‌కొంది. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ ల క‌ల‌యిక‌లో రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఈ భారీ మ‌ల్టీస్టార‌ర్ ప్రీరిలీజ్ బిజినెస‌ప్ కూడా `బాహుబ‌లి` రేంజ్‌కి ఏ మాత్రం తీసిపోని స్థాయిలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది. దానికి నిద‌ర్శ‌న‌‌మే ఈ చిత్ర త‌మిళ వెర్ష‌న్‌ థియేట్రిక‌ల్ రైట్స్‌ని `2.O` నిర్మాత లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధినేత సుభాస్క‌ర‌న్ ద‌క్కించుకోవడం. తాజాగా బుధ‌వారం ఈ విష‌యాన్ని చిత్ర నిర్మాత డీవీ దాన‌య్య తో పాటు లైకా ప్రొడ‌క్ష‌న్స్ అధికారికంగా ప్ర‌క‌టించింది.

త‌మిళ వెర్ష‌న్ హ‌క్కుల కోసం లైకా ప్రొడ‌క్ష‌న్స్ దాదాపు 45 కోట్లు చెల్లించిన‌ట్టు చెబుతున్నారు. ఇది `బాహుబ‌లి ది కంక్లూజ‌న్‌`కి వెచ్చించిన దానితో స‌మానం అని తెలుస్తోంది. ఇప్ప‌టికే భారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ చిత్రాన్ని ద‌స‌రా కానుక‌గా అక్టోబ‌ర్ 13న భారీ స్థాయిలో వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయ‌బోతున్నారు. `బాహుబ‌లి` స్థాయి రికార్డుల్ని ఈ మూవీ సాధిస్తుందా?  లేదా అన్న‌ది తెలియాలంటే అక్టోబ‌ర్ 13 వ‌ర‌కు వేచి చూడాల్సిందే.