RRR టీమ్ డేట్ అనౌన్స్ చేయ‌బోతున్నారా?

RRR టీమ్ డేట్ అనౌన్స్ చేయ‌బోతున్నారా?
RRR టీమ్ డేట్ అనౌన్స్ చేయ‌బోతున్నారా?

ద‌ర్శ‌‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న భారీ మల్టీస్టార‌ర్ చిత్రం `ఆర్ఆర్ఆర్‌`. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్లార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్న చిత్ర‌మిది. డీవీవీ దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రంపై దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి .`బాహుబ‌లి`తో రాజ‌మౌళి పాన్ ఇండియా స్థాయిలో అటెన్ష‌న్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఈ మూవీ త‌రువాత రాజ‌మౌళి నుంచి వ‌స్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్రంపై ఏ చిన్న అప్‌డేట్ వ‌స్తోంద‌న్నా అంద‌రి దృష్టి దానిపై వుంటోంది.

తాజాగా సోమ‌వారం చిత్ర బృందం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు బిగ్ అనౌన్స్‌మెంట్ ఇవ్వ‌బోతున్నాం అంటూ ప్ర‌క‌టించారు. మీరంతా ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న అనౌన్స్‌మెంట్‌ని మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు ప్ర‌క‌టించ‌బోతున్నాం అంటూ వెల్ల‌డించారు. అయితే ఈరోజు `ఆర్ఆర్ఆర్‌` రిలీజ్ డేట్‌ని ప్ర‌క‌టించే అవ‌కాశం వుంద‌ని తెలుస్తోంది.

ఇటీవ‌ల ఈ చిత్రంలో న‌టిస్తున్న అలీస‌న్ డూడీ ఈ చిత్రాన్ని మేక‌ర్స్ ఈ ఏడాది అక్టోబ‌ర్ 8న రిలీజ్ చేయ‌బోతున్నార‌ని ప్ర‌క‌టించింది. ఆ త‌రువాత ఆ న్యూస్ వైర‌ల్ కావ‌డంతో వెంట‌నే డెలీట్ చేసింది. తాజాగా ఆర్ ఆర్ ఆర్ టీమ్ బిగ్ నౌన్స్‌మెంట్ అంటూ ప్ర‌క‌టించ‌డంతో అంతా ఇదే డేట్‌ని చిత్ర బృందం అధికారికంగా ప్ర‌క‌టించ‌బోతున్నార‌నే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.