హైద‌రాబాద్ హోట‌ళ్ల‌లో `ఆర్ఆర్ఆర్‌` టీమ్!


హైద‌రాబాద్ హోట‌ళ్ల‌లో `ఆర్ఆర్ఆర్‌` టీమ్!
హైద‌రాబాద్ హోట‌ళ్ల‌లో `ఆర్ఆర్ఆర్‌` టీమ్!

`ఆర్ఆర్ఆర్‌` టీమ్ క్వారెంటైన్‌కు ప‌రిమితం కాబోతోంది. గ‌త ఏడు నెల‌లుగా ఆగిపోయిన షూటింగ్‌లు తిరిగి ప్రారంభం అయిన విష‌యం తెలిసిందే. ఇదే క్ర‌మంలో `ఆర్ఆర్ఆర్‌` షూట్ కూడా ప్రారంభం అవుతోంది. ఇందు కోసం టీమ్ మొత్తం భారీ ఏర్పాట్లు చేసింది. సోమ‌వారం షూటింగ్‌ని పునః ప్రారంభిస్తున్నారు. అయితే ఇందు కోసం టీమ్ మొత్తం రెండు వారాల పాటు క్వారెంటైన్‌కే ప‌రిమితం కానుంద‌ట‌.

ఈ మూవీకి ప‌ని చేయ‌డం కోసం టెక్నీషియ‌న్స్‌, ఆర్టిస్ట్‌లు దేశంలోని వివిధ సిటీల నుంచి వ‌స్తున్నారు. అయితే ముందు జాగ్ర‌త్త‌ల్లో భాగంగా ఎవ‌రికి వైర‌స్ సోక‌కూడ‌దంటే టీమ్ స‌భ్యుల్లో అత్య‌ధిక మంది హోట‌ళ్ల‌కే ప‌రిమితం కావాల‌ని ద‌ర్శ‌కుడు రాజ‌మౌళి ప్లాన్ చేశార‌ట‌. రాజ‌మౌళి నుంచి హీరోలు ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్‌.. షూట్‌లో పాల్గొనే టీమ్ మెంబ‌ర్స్ మొత్తం క్వారెంటైన్‌లోనే వుండ‌బోతున్నార‌ట‌.

ఇందు కోసం బంజారా హిల్స్‌లోని పార్క్ హైయ‌త్ హోట‌ల్ తో పాటు మాదాపూర్‌లోని ఓ ప్ర‌ముఖ హోట‌ల్‌లో సూట్‌ల‌ని బుక్ చేశార‌ట‌. కేవ‌లం రెండు వారాల పాటు జ‌రిగే షూటింగ్ కోసం ఈ ఏర్పాట్లు చేసిన‌ట్టు తెలిసింది. షూట్ మొద‌లైన త‌రువాత టీజ‌ర్‌ని రిలీజ్ చేయ‌బోతున్నామ‌ని రాజ‌మౌళి వెల్ల‌డించిన‌ట్టు తెలిసింది.