`ఆర్ఆర్ఆర్`‌పై సెటైర్.. టీమ్ స్మార్ట్ రిప్లై!

`ఆర్ఆర్ఆర్`‌పై సెటైర్.. టీమ్ స్మార్ట్ రిప్లై!
`ఆర్ఆర్ఆర్`‌పై సెటైర్.. టీమ్ స్మార్ట్ రిప్లై!

ద‌ర్శ‌‌క‌ధీరుడు ఏ సినిమా చేసినా చాలా టైమ్ తీసుకుంటుంటార‌న్న‌ది అంద‌రికి తెలిసిందే. ఒక్కో చిత్రానికి రెండు మూడేళ్లు తీసుకుంటున్న రాజ‌మౌళి ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్న విష‌యం తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలిసారి క‌లిసి న‌టిస్తున్నారు. ఈ డెకేడ్‌కే అత్యంత భారీ మ‌ల్టీస్టార‌ర్ చిత్రంగా తెర‌కెక్కుతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

ఏ చిన్న అప్‌డేట్ ఈ సినిమా నుంచి వ‌స్తోంద‌ని తెలిసినా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మూవీకి సంబంధించిన ఈ సంక్రాంతికి ఏదైనా స్పెష‌ల్ స‌ర్‌ప్రైజ్ వుంటుంద‌ని భావించారు. కానీ ఎలాంటి అప్‌డేట్ లేక‌పోవ‌డంతో నిరుత్సాహానికి గుర‌య్యారు. అయితే ఓ అభిమాని మాత్రం `ఆర్ఆర్ఆర్` టీమ్‌పై సెటైర్ వేశాడు. `ఆర్ఆర్ఆర్` రాజ‌మౌళి కుటీరం పేరుతో ఓ కార్టూన్ వేసిన స‌ద‌రు అభిమాని అంటుతో ఇద్ద‌రు హీరోలు రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ వైట్ అండ్ వైట్ డ్రెస్సుల్లో నిల‌బ‌డి ఏదో మాట్లాడుకుంటున్న‌ట్టుగా క‌నిపిస్తున్నారు.

ప‌క్క‌నే ఇద్ద‌రు మ‌హిళ‌లు ముగ్గులు వేస్తూ సినిమా రిలీజ్‌పై కామెంట్ చేస్తున్న సంబాష‌ణ వుంది. `అక్కా ఇంత‌కీ సినిమా రిలీజ్ ఎప్పుడు? అని చెల్లి ప్ర‌శ్నించ‌గా.. త‌ప్ప‌మ్మా తెలియ‌నివి అడ‌క్కూడ‌దు` అంటూ అక్క బ‌దులిస్తోంది. ఈ సెటైర్‌ని చూసిన `ఆర్ఆర్ఆర్` టీమ్ తాజాగా స్పందించింది. `సృజ‌నాత్మ‌క‌త‌తో కూడిన సెటైర్ చాలా బాగుంది.. సంక్రాంతి శుభాకాంక్ష‌లు` అంటూ స్మార్ట్‌గా రిప్లై ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటోంది.