మార్చి 15న `ఆర్ ఆర్ ఆర్‌` అప్‌డేట్ ఏంటీ?

 

RRR team surprise update for march 15
RRR team surprise update for march 15

రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న అత్యంత భారీ ప్ర‌తిష్టాత్మ‌క చిత్రం `ఆర్ ఆర్ ఆర్‌`. డీవీవీ దాన‌య్య ఈ చిత్రాన్ని అత్యంత భారీ బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిస్తున్నారు. యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ తొలి సారి క‌లిసి న‌టిస్తున్న చిత్రం కావ‌డంతో ఈ చిత్రంపై స‌ర్వ‌త్రా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. హాలీవుడ్ న‌టి ఒలివియా మోరీస్‌, బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ హీరోయిన్ లుగా న‌టిస్తున్న ఈ మూవీని అక్టోబ‌ర్ 13న ద‌స‌రా కానుక‌గా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌ని ప్లాన్ చేస్తున్నారు.

అల్లూరి సీతారామ‌రాజు,  కొమ‌రం భీం వంటి ఫెరోషి‌య‌స్ పాత్ర‌ల్లో రామ్‌చ‌ర‌ణ్‌, ఎన్టీఆర్ న‌టిస్తున్నారు. ఇందులో సీతారామ‌రాజు భార్య సీత‌గా బాలీవుడ్ న‌టి అలియాభ‌ట్ న‌టిస్తోంది. మార్చి 15న ఆమె పుట్టిన రోజు. ఈ సంద‌ర్భంగా `ఆర్ ఆర్ ఆర్‌` నుంచి స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్‌ని ఇవ్వాల‌ని టీమ్ భావిస్తోంద‌ట‌. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్స్ సినిమాపై భారీ అంచ‌నాల్నిపెంచేశాయి.

అలియా కు సంబంధించిన స‌ర్‌ప్రైజ్‌తో రాజ‌మౌళి ఆడియ‌న్స్‌ని మెస్మ‌రైజ్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. ఇటీవ‌ల సంజ‌య్ లీలాభ‌న్సాలీ `గంగూభాయి క‌త‌వాడీ` టీజ‌ర్‌ని రిలీజ్ చేసి స‌ర్‌ప్రైజ్ చేసిన విష‌యం తెలిసిందే. ఇందులో అలియా టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోంది. ఈ టీజ‌ర్ చూసిన రాజమౌళి సంజ‌య్ లీలా భ‌న్సాలీని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.